Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
సీఎంఆర్ఎఫ్ పేదలకు కొండంత అండ అని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వీటి కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో తిప్పర్తి మండలానికి చెందిన 21 మంది లబ్దిదారులకు రూ.6,75,500 విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనునిత్యం పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, తిప్పర్తి మండల టీఆర్ఎస్ అధ్యక్షులు పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వనపర్తి నాగేశ్వరరావు, తిప్పర్తి, నల్లగొండ పీఏసీఎస్ చైర్మెన్లు పాశం సంపత్‌రెడ్డి, అలకుంట్ల నాగరత్నం రాజు, తిప్పర్తి మండల ఉపాధ్యక్షులు ఏనుగు వెంకట్‌రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి సభ్యురాలు వనపర్తి జ్యోతి, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కొండ్ర స్వరూప పాల్గొన్నారు.