Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పెంటయ్య
నవతెలంగాణ-అనంతగిరి
ప్రతి శుక్రవారం గ్రీన్డే నిర్వహించి మొక్కల ఎదుగుదలకు పాదులు చేసి నీరందించాలని జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డా.పి.పెంటయ్య అన్నారు. మండల కేంద్రంలో గోల్తండా, అనంతగిరి గ్రామాలలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా తీవ్రత దష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలకు గ్రామంలో నిరంతరం పని కల్పించి వారికి ఆర్థిక చేయూత ఇవ్వాలనే సంకల్పంతో గ్రామాల్లో రోజుకి 250 మంది కూలీలకు తగ్గకుండా ఉపాధి హామీ పనులు కల్పించాలన్నారు.ప్రస్తుతం ప్రతి గ్రామంలో 150 మంది మాత్రమే హాజరవుతున్నారన్నారు.మండలకేంద్రాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాలు కూడా పనులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.గోల్తండా గ్రామంలో పశువుల కొట్టం నిర్మాణం పనులను పరిశీలించి అనంతరం నర్సరీ మొక్కలను సందర్శించి లోపాల సవరణకు సూచనలు ఇచ్చి వచ్చే 50 రోజుల్లో హరితహారం కొరకు మొక్కలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.సెగ్రిగేషన్ పేమెంట్ విషయంలో అలసత్వం వహిస్తున్న ఈసీ వెంకన్నను విధుల నుండి తప్పిస్తూ ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు.ఉపాధి హామీ పనుల వద్ద కొన్ని గ్రూపులను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పనులు కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీవో శైలజ, ఇరు గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు,కార్యదర్శులు పాల్గొన్నారు.