Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
కల్యాణలక్ష్మీ పథకం పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటిదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో 93 మంది లబ్దిదారులకు 93 లక్షలా 10 వేలా 788 రూపాయల విలువైన కల్యాణలక్ష్మీ, షాదీముబారక్చెక్కులను ఆయన అందజేసి మాట్లాడారు.రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు.రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటిపథకాలు పేద ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయన్నారు.పేదలకు సీఎంఆర్ఎఫ్ వరంలాంటిదన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు సీఎంసహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే వెంటనే సీఎం కేసీఆర్ సహాయాన్ని మంజూరు చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎలకాబిందు, జెడ్పీటీసీ నల్లపాటి ప్రమీలశ్రీనివాస్, తహసీల్దార్ గుగులోతు కృష్ణానాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తొగరు రమేశ్, మునగాల సర్పంచ్ చింతకాయల ఉపేందర్, అజరుకుమార్, పీఏసీఎస్ చైర్మెన్లు కందిబండ సత్యనారాయణ, తొగరు సీతారాములు,ఎంపీడీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.