Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెల్ప్లైన్సెంటర్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు కోరారు.శుక్రవారం జిల్లాకేంద్రంలోని మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్లో ఆయా సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెల్ప్లైన్సెంటర్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.మడో దశ కరోనా తీవ్రంగా విజంభిస్తున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని విమర్శించారు. కనీసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదన్నారు. ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరతల వల్ల అనేక మంది మరణిస్తున్నారని,రోజుకు సుమారు నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడానికి వ్యాక్సిన్ సరఫరాను పెంచడానికి ముందుకు రావడం లేదని విమర్శించారు. ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో కార్మిక,కర్షక సంఘాలు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా కోవిడ్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించామన్నారు.అన్ని మండలాలలో కోవిడ్ హెల్ప్‌లైన్ కేంద్రాలను ప్రారంభిస్తు న్నామన్నారు. సహాయం పొందాలనుకునే వారు 9848217230, 6303986313, 9959387706నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దండ వెంకట్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా నాయకులు చెరుకు యాకలక్ష్మి ,మేకనబోయిన శేఖర్, వల్లపుదాసు సాయికుమార్, చెరుకు సత్యం పాల్గొన్నారు.