Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణంలో 50 ఏండ్లుగా స్థానికంగా ఉన్న కూరగాయల మార్కెట్‌ని సంతలో మోడల్ మార్కెట్ కట్టిన తర్వాత తరలించాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ముత్యాలు డిమాండ్ చేశారు.శుక్రవారం కూరగాయల మార్కెట్ వ్యాపారులతో ఆయన మాట్లాడారు.ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్‌ను సంతలోని ఎఫ్‌సీఐ గోదాంలోకి మార్చడం దారుణమన్నారు.మోడల్ మార్కెట్ పేరుతో ఇక్కడ ఉన్న మార్కెట్‌ను అక్కడకు తరలించడం సరికాదన్నారు.కోవిడ్ సమయంలో వారికి కొంతసమయం ఇవ్వాలన్నారు.సంతలో వైన్‌షాపు, బార్‌షాపు ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.మళ్లీ అదే ప్రాంతంలో మార్కెట్ పెట్టడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు.ప్రభుత్వం మోడల్ మార్కెట్‌గా చేస్తానని చెప్పిందని, నేటికీ దాని గురించి ప్రస్తావన లేదన్నారు.అభివద్ధి పేరుతో మార్కెట్ యాజమాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే విధంగా మున్సిపల్ అధికారులు యత్నిస్తున్నారని విమర్శించారు.ఈ ఆలోచనను విరమించుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కూరగాయల మార్కెట్ వ్యాపారులు పాల్గొన్నారు.