Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
హైదరాబాద్ నుంచి కోల్‌కతాకు లోడ్‌తో వెళుతున్న ట్రాన్స్ పోర్ట్ డీసీఎం వాహనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి దగ్ధమైంది. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి మున్సిపల్ కేంద్రంలోని పెద్ద చెరువు ముత్యాలమ్మ గుడి సమీపంలో చోటు చేసుచేసుకుంది. ఎస్ఐ జి.ఉదరు కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం... ఆత్మకూరు(ఎం) మండలం మోదుగుబావిగూడెం గ్రామానికిచెందిన డీసీఎం యజమాని, డ్రైవర్ కోల బాలరాజు తన డీసీఎం వాహనం(టీఎస్ 30 టీ 4695)లో హైదరాబాద్ బొల్లారం నుంచిఏసియన్ పెయింట్ కంపెనీకి చెందిన 667 బాక్సులు, మేడ్చల్ మండలం డబిల్‌పురా నుంచి ఓస్టెర్ మెడిసెఫ్ ప్రైవేట్ కంపెనీకి చెందిన 154 మెడిసిన్ బాక్సుల లోడ్ కోల్‌కతాకు వెళుతుంది. కాగా డీసీఎంలో గురువారం అర్థరాత్రి మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ ముత్యాలమ్మ గుడి వద్దకు చేరుకోగా మంటలు చెలరేగాయి. వాహనంలో మంటలను గమనించి డ్రైవర్ వాహనం ఆపగా అంతలోనే ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. వాహనంలో ఉన్న పెయింట్, మెడిసిన్ బాక్సులు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న మోత్కూరు, రామన్నపేట అగ్నిమాపక కేంద్రాలకు చెందిన ఫైర్ ఆఫీసర్ సాయిదీపక్ ఆధ్వర్యంలో సిబ్బంది మసూద్ అహ్మద్, కష్ణయ్య, జానిమియా, రవీంద్రనాయక్, జితేందర్, తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు చల్లార్చారు. అగ్ని ప్రమాదంతో పెయింట్, మెడిసిన్ బాక్సులు కాలిపోయి రూ.18.83 లక్షల నష్టం వాటిల్లింది. డీసీఎం కూడా పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.12 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని డీసీఎం యజమాని వాపోయాడు. డీసీఎం డ్రైవర్ బాలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఎ ఉదరు కిరణ్ తెలిపారు.