Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరురూరల్ : మండలంలోని పటేల్ గూడెంలో కరోనా బాధితులకు శుక్రవారం కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్‌చార్జ్జి బీర్ల అయిలయ్య గుడ్లు, బియ్యం పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షులు మామిడాల ఆంజనేయులు, గ్రామ శాఖ అధ్యక్షులు జాహంగీర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సంపత్, ఉపసర్పంచ్ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
బీర్ల పౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని శ్రీనివాస్ పురం, గుండ్ల గూడెం రెండు గ్రామాల్లో కరోనా బాధితులకు గుడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అజరు సురేష్. రమేష్ ,జహంగీర్, పాల్గొన్నారు.
మండలంలోని తూర్పు గూడెంలో కరోనా బాధితులకు శుక్రవారం సర్పంచ్ వంగాల శ్రీశైలం నిత్యావసర వస్తువులను పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో బండి నరేందర్ ,బండి పాండరీ యబండి కష్ణమూర్తి ,బండి ఆంజనేయులుయ గజారాజుల పొసయ్య ,అందే అంజయ్య ,బండిసత్యనారాయణ పాల్గొన్నారు.
మండలంలోని కొల్లూరు గ్రామంలో ఇటీవల చనిపోయిన గ్యాదపాక మల్లమ్మ దశదిన కర్మకు టీపీసీసీ సెక్రెటరీ జనగాం ఉపేందర్ రెడ్డి శుక్రవారం బియ్యం పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రేగళ్ళ లింగం, ,ఆలేరు వైస ఎంపీపీ లావణ్య వెంకటేష్ ,యూత్ అధ్యక్షుడు జియాలాల్, మాజీ సర్పంచ్ పిల్లలమర్రి శంకరయ్య.బాలస్వామి,గణేష్ యాదగిరి, బిక్షపతి, మస్తాన్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.