Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటాడుతున్న గోనె సెంచుల కొరత
- నాలుగైదు రోజులుగా నిలిచిన కొనుగోళ్లు
నవతెలంగాణ చిట్యాల
చిట్యాల మండలంలో సహకార బ్యాంకు ఆధ్వ ర్యంలో 13 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇందులో ఏ ఒక్క కేంద్రంలోనూ పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. ఇందులో గుండ్రంపల్లి కేంద్రానికి 10,500 క్వింటాళ్ల ధాన్యం రాగా 4,500 క్వింటాళ్లను కొనుగోలు చేశారు. సుంకనపెల్లిలో 12,567.20 క్వింటాళ్లకు గాను 6500, ఏపూరులో 5,178.80 క్వింటాళ్లకు గాను 1000, వెలిమినేడులో 20780 క్వింటాళ్లకు గాను 12,000, పెద్దకాపర్తిలో 18,619.60 క్వింటాళ్లకు గాను 10,000, చిన్నకాపర్తిలో 11,337.60 క్వింటాళ్లకు గాను 12000, చిట్యాలలో 33,870 క్వింటాళ్లకు గాను 13,548, వనిపాకలలో 24,021 క్వింటాళ్లకు గాను 9608.4, వట్టిమర్తిలో 40,779 క్వింటాళ్లకు గాను 16,311.6, నేరడ గ్రామంలో 31,016 క్వింటాళ్లకు గాను 12,406.4, ఎలికట్టె గ్రామంలో 7,725 క్వింటాళ్లకు గాను 3090, తాళ్ల వెల్లంల గ్రామంలో 13,443 క్వింటాళ్లకు గాను 5,377.2, ఉరుమడ్ల గ్రామంలో 34,904 క్వింటాళ్లకు గాను 13,961.6, చిట్యాల పట్టణంలోని మార్కెట్ యార్డ్లో 23,402 కొనుగోలు చేయగా 400 కింటాళ్ల ధాన్యం మిగిలింది.
వెంటాడుతున్న గోనె సంచుల కొరత
మండలంలోని 13 కేంద్రాల్లోనూ గోనె సంచుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో కేంద్రాల వద్ద రైతుల ధాన్యం పేరుకు పోతోంది. నాలుగైదు రోజుల నుంచి కొనుగోళ్లు నిలిచి పోయాయి. అసలే వర్షాలు వస్తున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిచి తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.