Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రాల వద్ద తడిసి మొలకెత్తుతున్న ధాన్యం
- మాగోస పట్టించుకునే టోళ్లే లేరు..
- ఉయ్యాల లక్ష్మయ్య - మాజీ సింగిల్ విండో డైరెక్టర్
నవతెలంగాణ - చిట్యాల
నేను సెంటర్కు వడ్లు తెచ్చి నెల రోజులు అవుతుంది. ఇంత వరకూ కాంటా పెట్టలేదు. వానలు పడుతుండ టంతో ధాన్యం మొలకెత్తుతోంది, వడ్లు కాంటా పెట్టడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో అర్ధం కాని పరిస్థితి. మా గోసను పట్టిం చుకునే నాథుడే లేకుండా పోయారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయడం వల్ల రైతులు అష్టకష్టాలూ పడుతున్నారు. తీవ్ర నష్టం వచ్చి దిగాలు చెందుతున్నారు. ఈ యేడు ఎక్కువ విస్తీర్ణంలో పంట దిగుబడి వచ్చిందని, మంచి ధర వస్తుందని రైతులందరూ ఆశ పడ్డారు. కానీ రైతులు పండించిన ధాన్యాన్ని మార్కెట్ యార్డులు, ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల నిర్వాహకులు సరిగా కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులకు ఆ సంతోషం లేకుండానే పోయింది. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెల గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదు. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో ధాన్యం మొలకెత్తుతున్న పరిస్థితి ఉంది.