Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీబీనగర్ ఎయిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ కిరణ్ కుమార్
- సీపీఐ(ఎం) హెల్ప్‌లైన్ సెంటర్ ఆధ్వర్యంలో ఫేస్బుక్ వెబినార్
నవతెలంగాణ - భువనగిరి
ప్రభుత్వం చెప్తున్న నాలుగు జాగ్రత్తలు పాటిస్తూ మనోనిబ్బరం ప్రజల్లో కల్పిస్తూ కరోనాను ఎదుర్కోవాల్సిన అవసరముందని బీబీనగర్ ఎయిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ నిర్వహిస్తున్న హెల్ప్‌లైన్ సెంటర్ ఆధ్వర్యంలో కరోనా నివారణ చర్యలు పరిష్కారమార్గాలు అనే అంశంపై ఫేస్బుక్ ద్వారా ఆన్లైన్ వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కరోనాను ఎదుర్కొనేందుకు ప్రధానంగా ఆరు అడుగుల దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, వ్యాక్సి నేషన్ ప్రక్రియ ద్వారా కరోనాను అంతం చేయగలు గుతామన్నారు. కరోనా వచ్చి న బాధితులు అధైర్య పడొద్దన్నారు. అధైర్య పడితే మనిషి శరీరం శక్తిని కోల్పోతుందని ఆ సమయంలో కరోనా వారి పైన పెద్ద ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. ఆరడుగుల దూరం ఉండటం వల్ల కరోనా వ్యాపించడానికి అవకాశం లేదన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలన్నారు. కరోనా బాధితులకు జిల్లా పరిధిలో ఉన్న ఎయిమ్స్ ఆస్పత్రిలో 70 బెడ్లు అందుబా టులో ఉన్నాయని, కరోనా బాధితులకు సేవలందిం చేందుకు 80 మంది డాక్టర్లు అదేవిధంగా 80 మంది నర్సులు ఉన్నారన్నారు. ఆక్సిజన్ అందుబాటులో ఉందని అందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరారు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ మాట్లాడు తూ . ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌ను అమలు చేస్తూనే డాక్టర్లు ఇస్తున్న సలహాలను అందరూ పాటించాలని కోరారు. కరోనా బాధితులు ఎవరూ కూడా మానసిక ధైర్యాన్ని కోల్పోవద్దన్నారు. మానసిక ధైర్యం ద్వారా కరోనాను అంతం చేయగలుగుతమన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు వ్యక్తులు అందరూ కరోనా బాధితులకు తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. సీపీఐ(ఎం) ద్వారా ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కేంద్రాలు ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నాయని వారికి ధైర్యాన్ని కోల్పో కుండా మనోనిబ్బరం నిరంతరంకల్పిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా
జాగ్త్రతలు పాటిస్తూ...గ్రామాల్లో కూడా హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వాటి ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి వారికి కూరగాయలు, నిత్యవసర వస్తువులు, ఇతర సౌకర్యాలను ఇంటికి వెళ్లి అందిస్తున్నట్టు చెప్పారు . బీబీనగర్ నిమ్స్‌ను 500 పడకలతో కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు ఇప్పటికే ఒత్తిడి తీసుకొచ్చామ న్నారు. కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శికి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ లేఖలు రాసాయని తెలిపారు. ఫేస్బుక్ లైవ్‌ను పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ సమన్వయం చేయగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు హెల్ప్‌లైన్ కేంద్రం బాధ్యులు కల్లూరి మల్లేశం, సిర్పంగి స్వామి పాల్గొన్నారు.
గ్రామాల్లో కూడా హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వాటి ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి వారికి కూరగాయలు, నిత్యవసర వస్తువులు, ఇతర సౌకర్యాలను ఇంటికి వెళ్లి అందిస్తున్నట్టు చెప్పారు . బీబీనగర్ నిమ్స్‌ను 500 పడకలతో కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు ఇప్పటికే ఒత్తిడి తీసుకొచ్చామ న్నారు. కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శికి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ లేఖలు రాసాయని తెలిపారు. ఫేస్బుక్ లైవ్‌ను పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ సమన్వయం చేయగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు హెల్ప్‌లైన్ కేంద్రం బాధ్యులు కల్లూరి మల్లేశం, సిర్పంగి స్వామి పాల్గొన్నారు.