Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ 15 ,16 పనులను, మల్లన్న సాగర్ నుండి కొండపోచమ్మ ప్యాకేజీ 15పనుల పురోగతిని బుధవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగడి సునీత, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్యాకేజ్ 15 వై జంక్షన్ 1.075కిమీ నుండి 36.2 45 కిమీ కాలువ పనుల కట్ అండ్ కవర్ , టన్నెల్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి సమస్యలు, కాంట్రాక్ట్ పేమెంట్, పనులపై సంబంధిత త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ప్యాకేజ్ 16 బస్వాపూర్ రిజర్వాయర్ను పరిశీలించారు. ఆయన వెంట ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ హరిరామ్, అధికారులు ఉన్నారు.