Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు,కార్మిక, వ్యవసాయ,ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోడీ గద్దె దిగాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు, అఖిల భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మండారి డేవిడ్‌కుమార్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు దంతాలరాంబాబు, రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు బుద్ధ సత్యనారాయణ, బహుజన రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి చామకూరి నర్సయ్య డిమాండ్ చేశారు.ఏఐకేఎస్‌సీసీ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా రైతు,కార్మిక,కార్మిక విధానాలను విడనాడాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ దగ్గర తెలంగాణ రైతు సంఘం, సీఐటీయూ, ఏఐటీయూసీ, అఖిల భారత రైతు కూలీ సంఘం,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం,ఐఎఫ్టీయూ, కేవీపీఎస్, ప్రజానాట్యమండలి, రైతు కూలీ సంఘం, ,బహుజన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో బ్లాక్‌డేగా పాటిస్తూ నల్లజెండాలు, ప్లకార్డులతో నిరసన తెలిపారు.దేశ ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆరు నెలలుగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన నేటికీ ఆరు నెలలకు చేరిందన్నారు.కేంద్రంలో నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చి నేటితో ఏడేండ్లవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కార్మిక ,కర్షక వ్యవసాయ కార్మికసంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బ్లాక్‌డేగా పాటిస్తున్నట్టు తెలిపారు. మోడీవిధానాలతోనే కరోనా రెండో వే ఉధృతి కొనసాగుతుందని విమర్శించారు.దీనివల్ల అనేక మంది ప్రజలు వ్యాక్సిన్ లేక, ఆక్సిజన్ అందక, వెంటిలేటర్ల కొరతతో తమ ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ మరణాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.కరోనా కట్టడిలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. మరో పక్క ప్రభుత్వరంగ సంస్థలన్నింటిని ప్రయివేట్‌పరం చేస్తూ, వ్యవసాయరంగాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి తీసుకువచ్చిన నల్లచట్టాలను రద్దు చేయాలన్నారు.ప్రజా పోరాటాలను అణిచివేసేందుకు అనేక కుట్రలు చేస్తూ ఆందోళన చేస్తున్న రైతాంగంపై దాడులు, దౌర్జన్యాలు చేస్తూ అనేక కేసులు బనాయిస్తూ ఇబ్బందుల పాలు చేస్తున్న మొక్కవోని ధైర్యంతో రైతులు సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నారన్నారు.కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్‌గా తీసుకువచ్చిన దానిని వెంటనే రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. కరోనా పరిస్థితులలో పేదలను ఆదుకోవడానికి ప్రతి కుటుంబానికి రూ.7500 నగదు రూపంలో ఇవ్వాలని, ప్రజా పంపిణీ ద్వారా ప్రతి ఒక్కరికి 10 కిలోల బియ్యంతో పాటు కేరళ వామపక్ష ప్రభుత్వం లాగా 17 రకాల నిత్యావసర వస్తువులు అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టియాదగిరిరావు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెల్లి సైదులు, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య ,కెేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగోపి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దండ వెంకట్‌రెడ్డి, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, దేశోజు మధు, న్యూడెమోక్రసీ చంద్రన్నవర్గం నాయకులు ఆరుట్ల శంకర్‌రెడ్డి, దొంతమల్ల రామన్న, నాయకులు పల్లేటి వెంకన్న, రామోజీ, కిషన్ పాల్గొన్నారు.