Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మోటకొండూర్
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కషి చేస్తున్నారని కరోనా కష్టకాలంలో కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే ,ప్రభుత్వ విప్ గొంగడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజల సౌకర్యం కోసం ఎంపీ నిధుల నుండి వీల్ చైర్, స్ట్రక్చర్, ఫ్లోవర్ బెడ్ ఇతర పరికరాలను అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలకు టీకాలు వేసేందుకు కేసీఆర్ ఎంతో కషి చేస్తున్నారన్నారు. బస్వాపురం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జిల్లాల ద్వారా ఆలేరు నియోజకవర్గం సస్యశ్యామలంగా మారుతుందన్నారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా స్థానిక సంస్థలను బలోపేతం చేసి గ్రామ స్వరాజ్యం చేసే ఈ విధంగా కేసీిఆర్ కషి చేస్తున్నారన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టాలంటే అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కొవిడ్ బాధితులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో త్వరలో ఓ ప్రైవేటు కంపెనీ సహకారంతో 30 పడకలతో నూతన ఐసోలేషన్ సెంటర్ను ఎర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పల్ల వెంకట్ రెడ్డి, ఎంపీపీ పైళ్ల ఇందిరా, సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్ గౌడ్, ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, మండల వైద్యాధికారి రాజేందర్ నాయక్, టీిఆర్ఎస్ మండల సెక్రెటరీ జనరల్ సిరబోయిన నర్సింగ్ యాదవ్, కష్ణంరాజు, జివిలికపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
24గంటలఆస్పత్రిగా మార్చాలని వినతి
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 24గంటల ఆస్పత్రిగా మార్చాలని కోరుతూ ఆదివారం మండల కేంద్రానికి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డిలకు యాత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో యాత్ర స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ సురుపంగ శివ లింగం, మాజీ ఉపసర్పంచ్ బొట్ల నర్సింహ ఉన్నారు.