Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నవ తెలంగాణ -నల్గొండ
కరోనా కష్టకాలంలో ప్రయివేటు ఉపాధ్యాయులను ఆదుకునేందుకు స్వచ్చంధసంస్థలు ముందుకు రావాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కోరారు. ప్రభుత్వం రేషన్ షాప్ ల ద్వారా అందిస్తున్న 25 కేజీల బియ్యాన్ని రెండవ విడతలో భాగంగా ఆదివారం వీటీకాలనీలోని రేషన్ షాప్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రయివేటు పాఠశాలలు మూతపడడంతో అందులో పనిచేసే ఉపాధ్యాయులు ఉపాధికోల్పోయారన్నారు. సీఎం కేసీఆర్ ఉపాధ్యాయులకు నెలకు రూ.2000, 25కిలోల బియ్యం అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి బిక్షపతి, మండల విద్యాధికారి నరసింహ, ప్రయివేటు పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు యానాల ప్రభాకర్ రెడ్డి, రామ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టులకు మాస్కులు పంపిణీ
కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ఆదివారం స్థానిక వీటీకాలనీలోని క్యాంపు కార్యాలయం వద్ద గాంధీ గ్లోబల్ ఫ్యామిలీఅండ్ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థల ఆధ్వర్యంలో పచ్చ కర్పూరం, వాము పువ్వు, పుదీనా పువ్వుతో తయారైన అమతధార , బ్రీత్ ఈజీ, మాస్కులను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలు పాటింపజేస్తూ కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చేయడంలో ప్రముఖ పాత్ర వహించాలని జర్నలిస్టులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, జిల్లా విధ్యాశాఖదికారి బిక్షపతి, ఆ సంస్థల ప్రతినిధులు యానాల ప్రభాకర్ రెడ్డి, రామ్ రెడ్డి, పాముల అశోక్, గిరిబాబు, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి, తిప్పర్తి ఎంపీటీసీ ఊట్కూర్ సందీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.