Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్య విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ - ఆలేరుటౌన్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆలేరు శాసన సభ్యురాలు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక రహదారిబంగ్లా వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత కొంతకాలంగా ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసంఈ ప్రాంత ప్రజలు వివిధ రూపాలలో ప్రభుత్వం దష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ దష్టికి పలుమార్లు తీసుకువెళ్లామన్నారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ విషయంపై రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌కు మార్చి 26 వ తేదీన వివరణ కోరారని తెలిపారు. మే 28 తేదీన ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక అందజేసినట్టు తెలిపారు , ఆలేరు భువిస్తీర్ణం ఎక్కువని చెప్పారు. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఆలేరు ప్రాంతాంనికి అన్ని హంగులు ఉన్నాయన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి దేవస్థానం, కొలనుపాక సోమేశ్వరాలయం జైన దేవాలయం తోపాటు ఈ ప్రాంతం చుట్టూ ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, కాకతీయులు చోళ రాజులు పాలించిన ప్రాంతం అని గుర్తుచేశారు. ఆలేరు, గుండాల, మోటకొండూర్, రాజాపేట, యాదగిరిగుట్ట, మండలాలు కలిపి రెవిన్యూ డివిజన్ ఏర్పాటువుతుందన్నారు. ఆలేరు కొలనపాక చరిత్ర గల ప్రాంతం అని గుర్తుచేశారు, ముఖ్యమంత్రి . కెసిఆర్ ద్రుష్టి కి తీసుకెళ్లి టూరిజం హాబ్ గా చెస్తామని తెలిపారు . అఖిల పక్ష నాయకులకు, ప్రింట్,మరియు ఎలాట్రానిక్ మీడియా కు శుభాకాంక్షలు తెలిపారు.
ధాన్యం కొనుగోలు చేస్తాం
నియోజకవర్గంలోని ఐకేపీ సెంటర్ల ద్వారా రైతుల వద్ద నుండి ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని తెలిపారు . వరి ధాన్యం అధిక దిగుబడులు రావడంతో నియోజకవర్గంలో ధాన్యం నిల్వలకు గోదాములు సరిపోని కారణంగానే జాప్యం జరుగుతోందన్నారు. గన్నీ బ్యాగుల కొరత ప్రస్తుతం లేదన్నారు .ధాన్యం నిల్వలు కొరకు ఇతర రైస్‌మిల్లులు సైతం లీజుకు తీసుకుంటున్నామన్నారు, రైతు సమస్యలు పరిష్కరించడానికి మంత్రి గంగుల కమలాకర్‌తో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామన్నారు. మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య అధ్యక్షత వహించిన ఈ సమావేశం లో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమిది రవీందర్ గౌడ్, వైస్ చైర్మెన్ గ్యాదపక నాగరాజు, పీఏసీఎస్ చైర్మెన్ మొగులగాని మల్లేష్, నాయకులు శ్రీనివాస్ ,మొరిగాడి వెంకటేష్, కౌన్సిలర్ బేతి రాములు, జుకంటి శ్రీకాంత్, కందుల శ్రీకాంత్,సింగిల్ విండో డైరెక్టర్ కుల సిద్ధులు బహదూర్‌పేట రైతు సమన్వయ సమితి సమితి అధ్యక్షులు కుళ్ల వెంకటేష్ , నాయకులు కుండే సంపత్, సింగల్ విండో డైరెక్టర్ కుళ్ళ సిద్దులు, పంతం కష్ణ, ఎండీ ఫయాజ్, షాబు, చింతకింది మురళి, కోనాపురం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
అభివద్ధి పనుల పరిశీలన
ఆలేరు పట్టణంలోని సాయిబాబా దేవాలయం నుండి మార్కెట్ కార్యాలయం వరకు వేస్తున్న రోడ్డు పనులను ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి పరిశీలించారు.పట్టణ అభివద్ధి గురించి తీసుకుంటున్న అభివద్ధి పనులు చర్యలపై మున్సిపల్ చైర్మెన్ వసుపరి శంకరయ్యను అడిగి తెలుసుకున్నారు.