Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కోసం స్థలాలు గుర్తించండి
- ధరణి దరఖాస్తులపై ప్రత్యేక దష్టి సారించండి
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో చేపట్టిన నూతన కలెక్టరేట్లభవనాల పనులను వేగం పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుండి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు నూతన కలెక్టరేట్ కాంప్లెక్సుల నిర్మాణాల పూర్తి, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్, నూతన మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు భూముల బదలాయింపు, ధరణికి సంబంధించిన విషయాలపై జిల్లా కలెక్టర్లు సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే 12 జిల్లాలో కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను వారంలోగా పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంచాలనికలెక్టర్లను ఆదేశించారు.కలెక్టర్ టి.వినరు కష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నూతన కలెక్టరేట్ భవన పనుల వేగం పెంచి త్వరలో పూర్తి చేసి అందుబాటులో ఉంచుతామన్నారు.అలాగే ధరణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి రైతులకు మేలు చేస్తున్నామన్నారు.జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ కోర్టు కోసం అనువైన భూమిని పరిశీలించి టీఎస్ఐఐసీకి అప్పగిస్తామన్నారు.స్పెషల్ ట్రిబ్యునల్ ద్వారా కేసుల విచారణ పూర్తి చేసి తద్వారా ఉత్తర్వులు జారీ చేసి రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటు న్నామన్నారు.జిల్లాలో ధరణి పోర్టల్‌లోని వివిధ అంశాలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై జిల్లా పనితీరుపై ప్రధాన కార్యదర్శి సంతప్తి వ్యక్తం చేశారు.జిల్లాలో రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేందుకు సత్వర చర్యలు తీసుకుంటామన్నారు.ఈ నెల 9 వరకు నిర్దేశించిన పనులు పూర్తి చేస్తామని వివరించారు.ఈ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు ఎస్.మోహన్‌రావు, పద్మజారాణి,టీఎస్ఐఐసీ మేనేజర్ రఫిక్, ఈఈ ఆర్అండ్ బీ యాకుబ్, డీఈ మహిపాల్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.