Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్
నవతెలంగాణ - భువనగిరి
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ ఈ నెల 10వ తేదీన జరిగే నిరసనలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ కోరారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లాస్థాయి ఆన్లైన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ ప్రజల, కార్మికవర్గం సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. కార్మికవర్గం అనేక త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా చేసి సామాజిక భద్రత, పనిగంటలు, కనీస వేతనం లాంటి సౌకర్యాలు లేకుండా చేస్తోందన్నారు. రైతు వ్యతిరేక మూడు చట్టాలు, విద్యుత్ సంస్కరణల బిల్లులు తీసుకొచ్చి పేదల పైన అన్ని రంగాల కార్మికుల పైన భారాలు మోపుతోందని ఆవేదన వ్యక్తపరిచారు. ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పుతూ దేశంలో నిరుద్యోగ సమస్యలు పెంచుతుందని విమర్శించారు. కరోనా వల్ల ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఫ్రంట్ లైన్లో ఉండి పని చేస్తున్నా వైద్యరంగం సిబ్బంది.కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్,ఆశా వర్కర్స్,గ్రామ పంచాయతీకార్మికులు,, మునిసిపల్ కర్మికులు, విభికేల లాంటి ఉద్యోగ కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని, రూ. 50 లక్షలు ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు. ప్రభుత్వ హాస్పటల్లో ఖాళీగా ఉన్న పోస్ట్ లను భర్తీ చేసి వైద్యసేవలను మెరుగు పర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు, జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేష్, మామిడి వెంకటరెడ్డి,కురెళ్ల రాములు.సహాయ కార్యదర్శులు ఎండి.పాషా, తుర్కపల్లి సురేందర్.జిల్లా కమిటి సభ్యులు మాయ కష్ణ, సుదర్శన్,గడ్డం వెంకటేశం, బండారి శ్రీ రాములు, నంధిశ్వర్.నాయకులు సత్యనారాయణ, జహంగీర్, మధు పాల్గొన్నారు.