Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామానికి చెందిన రాసాల మల్లేశ్ యాదవ్ ఇటీవల మతి చెందాడు. కుటుంబ సభ్యులను ఆదివారం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించి, లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వడాయి గూడెం సర్పంచ్ గుండు మనీష్ కుమార్, యాదాద్రి మున్సిపల్ చైరెపర్సన్్ సుధా హెమెందర్ , యదాద్రి టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, మిట్ట వెంకటయ్య, గుండు ముత్తయ్య గౌడ్, కసాని శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి నీల ఓం ప్రకాష్ గౌడ్, నక్కల చిరంజీవి, యాదగిరిగుట్ట ఆకుల మల్లేష్ యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షులు చుక్కల శంకర్ యాదవులు, పుట్ట వీరేశ్ యాదవ్, గుండెబోయిన సురేష్ యాదవ్, తిమ్మాపురం ఎంపీటీసీ ఆంజనేయులు , ఎంపీటీసీ నోముల మల్లేష్, నాయకులు బబ్బురి పోశెట్టి గౌడ్, కళ్ళం కష్ణ , మతుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..