Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీతాల కోసం ఆర్టీసీ కార్మికుల ఎదురు చూపులు
- భారంగా కుటుంబ పోషణ
- పట్టించుకోని ఆర్టీసీ యాజమాన్యం
నవతెలంగాణ -నార్కట్‌పల్లి
ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్ర ఖజానాకు. ఆదాయాన్ని సమకూర్చే ఒకప్పటి బంగారు బాతు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. నేడు కోవిద్ 19 కరోనా వైరస్ తాకిడికి చితికి పోయింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది అన్నమో రామచంద్రా అంటూ అలుమటిస్తున్న పరిస్థితులు దాపురించాయి. కుటుంబాన్ని పోషించుకునేందుకు నెల రోజులు కష్టపడ్డ సమయానికి వేతనాలు అందక 45 రోజులు గడిచినప్పటికీ వేతనాల కోసం కడగండ్లు చేసుకుంటూ ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. నల్లగొండ రీజియన్‌లో ఏడు బస్సు డిపోలు ఉన్నాయి. నార్కట్‌పల్లి బస్ డిపోలో మొత్తం 310 మంది సిబ్బంది పని చేస్తున్నారు .అందులో 110 మంది డ్రైవర్లు ,140 మంది కండక్టర్లు ,30 మంది గ్యారేజ్ సిబ్బంది, మరో 30 మంది కార్యాలయం సిబ్బంది ఉన్నారు. ప్రస్తుత కరోనా మహమ్మారి విజృంభనతో అన్ని రంగాలు చితికి పోయాయి. విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి ఆపద వస్తుందోనని భయాందోళనలో తోటి వారికి సహాయ సహకారాలు అందించే పరిస్థితి లేకపోవడం ఆందోళన కలిగించే విషయం .ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన ప్పటికీ ప్రభుత్వాలు ప్రజాసంక్షేమానికి పెద్ద పీట వేసినప్పటికీ సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిని పట్టించుకోకపోవడం శోచనీయం. ప్రభుత్వం కరోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించినప్పటికీ నామమాత్రంగా బస్సులు చెపుతున్నపుడు ఆర్టీసీ సిబ్బంది మాత్రం 100శాతం విధులకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ నెల రోజులు అష్టకష్టాలు పడి విధులకు హాజరు అవుతున్నప్పటికీ యాజమాన్యాలు వేతనాలు చెల్లించకపోవడంతో ఆ కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇంట్లో నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడం తో పాటు ఇంటి అద్దె , చెల్లించడం బ్యాంకు రుణాలతో సొంత ఇంటి కల నేర్చుకున్నవారు ఈఎంఐ చెల్లించలేక, బీమా కంపెనీలకు ప్రీమియం డబ్బులు సకాలంలో చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు కుటుంబ సభ్యులు అనారోగ్య బారిన పడితే వారి గతి అంతే . ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉన్నత అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రాలు సైతం సమర్పించినప్పటికీ వీరి గోడును వినే వారే కరువయ్యారు.
ఇల్లు గడవడం కష్టంగా ఉంది
చిలుకల నరసింహ డ్రైవర్ నార్కట్‌పల్లి బస్‌డిపో
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో నెల రోజులు కష్టపడి నప్పటికీ సకాలంలో వేతనాలు అందక ఇల్లు గడవడం కష్టంగా మారింది. నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడం, ఇంటిఅద్దె చెల్లించడం కష్టంగా మారింది. నిత్యావసర సరుకులు ఇవ్వడానికి సైతం వ్యాపారస్తులు నిరాకరిస్తున్నారు.
దారి ఖర్చులు సైతం కష్టంగా మారాయి
డ్రైవర్ భాస్కర్ రెడ్డి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో విధులు నిర్వర్తించేందుకు హాజరుగుతున్నప్పటికీ మధ్యాహ్న భోజనం రోజువారి పెట్రోల్ ఖర్చు , దారి ఖర్చులు సైతం భారంగా మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి గత ప్రభుత్వాలు ప్రతి నెల 30వ తేదీన వేతనాలు అందించే విధంగా చర్యలు చేపట్టాలి.
వేతనాల కోసం ఎదురుచూపులే
డ్రైవర్ ఖలీల్ అహ్మద్
నెల రోజులు కష్టపడినప్పటికీ వేతనాల కోసం ప్రతినెల ఎదురుచూపులే . 15 రోజులు గడిచినప్పటికీ వేతనాలు సకాలంలో అందక ఇబ్బంది పడుతున్నాం. ఇకనైనా అధికారులు స్పందించి అన్ని ప్రభుత్వ శాఖలకు అందించిన విధంగానే ప్రతి నెల మొదటి వారంలో ఆర్టీసీ కార్మికులకు వేతనాలు అందించాలి.