Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
కరోనాను కట్టడి చేయకుండా బాధ్యతను విస్మరిస్తే భారీ మూల్యం తప్పదని తెలంగాణ సాంస్కతిక సారథి జిల్లా టీమ్ లీడర్ పల్లెల లక్ష్మణ్ అన్నారు.బుధవారం మండల పరిధిలోని గుంజలూర్ గ్రామంలో జరిగిన కళాజాతా ప్రదర్శన అనంతరం ఆయన మాట్లాడుతూ కలెక్టర్ వినరుకష్ణారెడ్డి ఆదేశాల ప్రకారం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి సూచనల మేరకు మండలంలోని ప్రతి గ్రామంలో కరోనాకట్టడికి పరిసరాల పరిశుభ్రత నకిలీ విత్తనాల ను కొనుగోలు చేసి పంటలు వేసి నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్వవసాయ అధికారుల సలహాలతో విత్తనాలు పురుగుల మందులు కొనుగోలు చేయాలని కోరారు.కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, పనిచేసే ప్రదేశంలో సామాజికదూరం పాటించి మాస్క్లు ధరించి కరోనాను కట్టడి చేయాలన్నారు.వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి బక్కయ్య, తెలంగాణ సాంస్కతిక సారథి కళా కారులు పాల కుర్తి శ్రీకాంత్, గంట భిక్షపతి, పల్లెల రాము, కుందమల్ల నాగలక్ష్మి, గజ్జి మంజుల, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.