Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
పేద ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించి 302 మందికి మంజూరైన సీఎంసహాయనిధి రూ.1,16,35,500 విలువ గల చెక్కుల్లో నల్లగొండ, పట్టణ, నల్లగొండ రూరల్ మండలాలకు చెందిన 208 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు యాదవ్ ,ప్రధాన కార్యదర్శి భువనగిరి దేవేందర్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.