Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకుంటామని ఎన్బీఆర్ చైర్మెన్ ఫౌండేషన్,యువనేత నల్లమోతు సిద్ధార్థ భరోసానిచ్చారు.కరోనా బారినపడి ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన 20 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున, నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేశారు.స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నల్లమోతు ఆయన మాట్లాడారు.కరోనా మహమ్మారి బారినపడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు తన వంతుగా సహకారం అందించానన్నారు.కోవిడ్ బారినపడిన మీడియా మిత్రులెవరూ అధైర్యపడొద్దని, మానసికంగా దఢంగా ఉండి కరోనాను జయించాలని సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించే జర్నలిస్టులకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసానిచ్చారు. జర్నలిస్టులంతా విధిగా టీకాలు వేయించుకోవాలని కోరారు. వ్యాక్సినేషన్ పూర్తయిన జర్నలిస్టులు కూడా వార్తా సేకరణ సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఇండ్ల నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఖచ్చితంగా మాస్కులు ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని కోరారు. ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి బాధిత జర్నలిస్టులకు సహకరి స్తోందన్నారు.ప్రభుత్వం గతనెల 28, 29వ తేదీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు వ్యాక్సినేషన్ చేపట్టిందన్నారు. కోవిడ్ బారినపడిన పలువురు జర్నలిస్ట్ కుటుంబాలను సిద్దార్ధ పరామర్శించి కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించారు.విపత్కర పరిస్థితుల్లో తమకు అండగా నిలిచిన నల్లమోతు సిద్దార్ధకు జర్నలిస్టులు ఈ సందర్భంగా కతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హామీద్ షేక్, షోయబ్, కౌన్సిలర్ సాధినేని శ్రీనివాస్ రావు, శ్యామ్ సుందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.