Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్థంతిసభలో జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
తెలంగాణ సాయుధపోరాటయోధులు కట్టెబోయిన రాములు జీవితం త్యాగాలమయమని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.కట్టెబోయిన రాములు వర్థంతి సందర్భంగా ఆదివారం స్థానిక నందిపాడు చౌరస్తా వద్ద ఆయన స్తూపానికి పూలమాలలలేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయుధపోరాటంలో ఎన్నో కష్టాలు, నిర్భంధాలు, దాడులు, దౌర్జన్యాలను ఎదుర్కొని తుపాకీ తూటాను సైతం లెక్కచేయకుండా పోరాటం సాగించారని గుర్తుచేశారు.దోపిడీకి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం మరువలేనిదన్నారు. ఉద్యమంలో ఉంటూనే కులాంతర వివాహం చేసుకొని ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన ఇంటినే ఉద్యమ కేంద్రంగా చేసుకొని ఎంతోమంది నాయకులను తీర్చిదిద్దారని గుర్తు చేశారు.దేశంలో పేదల రాజ్యం రావడానికి ఎర్రజెండానే ఆధారమని పేదల పక్షాన నిలబడి నికరంగా పోరాడిన వ్యక్తి రాములు అన్నారు. అదేవిధంగా పూసలపాడు గ్రామంలో సర్పంచ్‌గా పని చేసి గ్రామాభివద్ధికి ఎనలేని కషి చేశారన్నారు.వీరతెలంగాణ సాయుధపోరాటంలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అన్నారు.ఆయన కుటుంబం ఇప్పటికీ ఎర్రజెండా నీడనే ఉండి తమ సేవలంది స్తున్నారన్నారు.సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశ్ మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి కషి చేసిన వ్యక్తి రాములు అన్నారు. ఈకార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి నూకల జగదీశ్చంద్ర, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, పి.సత్యనారాయణరావు, శ్రీనివాసాచారి, బావండ్ల పాండు, పి.రాంమ్మూర్తి, తిరుపతి రామ్మూర్తి, దేశీరాం నాయక్, రామారావు, మహిళా సంఘం నాయకురాలు పద్మమ్మ, సోమయ్య, మల్లయ్య, నాయకుడు, వెంకట్‌రెడ్డి, రాములు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.