Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో నేటి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ భూముల అమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండలో ఆదివారం దొడ్డి కొమురయ్య భవన్లో కొమురయ్య75వ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ భూమికోసం, భుక్తికోసం, పీడిత ప్రజల విముక్తి కోసం, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా జరిగిన మహా త్తరమైన పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమన్నారు. ఆ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో సాయుధ పోరాటాంగా మారిందన్నారు.విసునూరు దేశ్‌ముఖ్ లు పేదలపై జరుపుతున్న ఆగడాల పై తిరగబడి పదివేల గ్రామాలను గ్రామ స్వరాజ్యలు గా ప్రకటించిన ఘనత నాటి తెలంగాణ సాయుధ పోరాటముదని అన్నారు. నాటి పోరాట స్ఫూర్తితో నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న రైతు, కార్మిక ,ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే పోరాటాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పట్టణ కార్యదర్శి ఎండి. సలీమ్,జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ హాషమ్ చినపాక లక్ష్మి నారాయణ, దండెం పల్లి సత్తయ్య,పుచ్చకాయ ల నర్సిరెడ్డి,పట్టణ కమిటీ సభ్యులు కుంభం కష్ణారెడ్డి,తుమ్మల పద్మ,అద్దంకి నరసింహ,కునుకుంట్ల ఉమా రాణి,కోట్ల అశోక్ రెడ్డి,కొండ వెంకన్న,గుండాల నరేష్, పాలది కార్తిక్, బోల్లు రవీందర్,సాగర్ల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.