Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్లేడ్తోలతో శరీరాన్ని గాయాలు చేసుకున్న వైనం
నవతెలంగాణ -నార్కట్‌పల్లి
మతిస్థిమితంలేని యువతి నార్కట్ పల్లి ఆర్టీసీ బస్ డిపోలో చెట్టు పైకి ఎక్కి బ్లేడ్‌తో శరీరాన్ని గాయ పరచుకున్న సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌కు చెందిన ఉద్యోగి కూతురు గత కొంత కాలంగా మతిస్థిమితం లేక పోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోవడం తరచుగా చేస్తుంది. ఇదే క్రమంలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న పాత భవనం పైనుంచి చెట్టు పైకి ఎక్కి రెండు గంటల పాటు అందరినీ హడలెత్తించిది.ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీస్ శాఖ అగ్నిమాపక శాఖ సిబ్బంది చాకచక్యంగా నిచ్చెన వేసుకొని చుట్టూ తీరా ఏర్పాటు చేసుకుని ఎలాంటి హానీ జరగకుండా ఆ యువతిని కిందికి దించారు . ఆ యువతిని స్థానిక కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు .వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చూసుకోవాలని సూచించారు.