Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధ ఉంటే పార్టీ మారుతామా..
- ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ - భువనగిరి
సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా కార్యకర్తగా అన్ని అర్హతలు ఉండి పదవి ఇవ్వకుంటే బాధ ఉంటుందని అంతమాత్రాన పార్టీ మారతారా అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేశారు. గురువారం పట్టణకేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు చాలా పార్టీల నుండి ఆఫర్ వచ్చినా పోలేదని తెలిపారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తినని తెలిపారు. అలాంటి వెంకట్ రెడ్డికి ఏ పదవి అవసరం లేదని తెలిపారు . భువనగిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు రూపాయి ఖర్చు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించారని విషయాన్ని గుర్తు చేశారు. కొన్ని మాటలు బాధ తోటి మాట్లాడిన అని తెలిపారు. తనకు పార్టీ మారే అవసరం లేదని తెలిపారు. మోసం అలవాటు లేదని రియల్ ఎస్టేట్ చేసే అవసరం లేదని గ్రూపులు కట్టి అవసరం కూడా లేదని అన్నారు. తనకు తెలిసింది కార్యకర్తలకు అండగా ఉండడం అని తెలిపారు. గ్రూపు రాజకీయాలకు అడ్డా అయితే బొందలకి వెళ్తామన్నారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మల్కాజిగిరి, తాను భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించక పోయామని తెలిపారు. గాంధీ భవన్లో కూర్చుంటే ఎన్నికల్లో గెలవడం కష్టమని వివరించారు. ప్రజలతో మమేకమై గ్రూపు లేకుండా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడినప్పుడే గెలుస్తామని తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజలతో మమేకమై ముందుకు సాగాలని సూచన చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పొత్నక్ ప్రమోద్ కుమార్, పీసీసీ మాజీ కార్యదర్శి తంగళ్ళపల్లి రవికుమార్, పట్టణ అధ్యక్షులు బిసు కుంట్ల సత్యనారాయణ, ఎలిమినేటి కష్ణారెడ్డి, గ్యాస్ చిన్న పాల్గొన్నారు.
వైసాస్సార్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన వెంకటరెడ్డి.
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం భువనగిరిలో ఘనంగా నిర్వహించారు .కిసాన్‌నగర్‌లో ఉన్న ఆయన విగ్రహానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు ఉచిత విద్యుత్ అందించిన విద్యార్థులకు ఉచిత విద్య ఫీజు రీయింబర్స్‌మెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి అని కొనియాడారు. 104, 108 పథకాలను తీసుకొచ్చిన ప్రణదాత అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తంగళ్ళపల్లి రవి కుమార్,పొత్నక్ ప్రమోద్ కుమార్, బర్రె జహంగీర్, బిసుకుంట్ల సత్యనారాయణ పాల్గొన్నారు.