Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయనో వసూలు రాజా
అ పతి పనికీ ఓ రేటు
అ ఆరోపణలు ఆయనపైనే
అ విచారణాధికారి కూడా అతనే..?
అ వార్డెన్లతో బలవంతపు సంతకాల సేకరణ
ఆయనో జిల్లా అధికారి...
బలహీనవర్గాల విద్యార్థుల భవిష్యత్, అణగారిన వర్గాల సంక్షేమం పూర్తిగా ఆయన చేతుల్లో ఉంది. దాన్నే ఆసరగా చేసుకొని తాను ఆడిందే ఆటగా... పాడిందే పాటగా వ్యవహరిస్తున్నాడు. అందరి సిబ్బందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి .. కానీ తన శాఖలో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బందిని వేధిస్తూ వారి వద్దనుంచి అందినంత వరకు వసూలు చేయడమే ప్రధాన అంశంగా పరిగణిస్తూ జేబులు నింపుకుంటున్నాడు. ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ పరిస్థితి ఇక్కడే కాదు.. గతంలో ఈయన పనిచేసిన ఏరియాలలో ఆయన పనితీరు ఇలాగే కొనసాగిందని ఆరోపణలున్నాయి.
ెనవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
వసతి గృహాల మరమ్మతుల కోసం ప్రతి హాస్టల్‌కూ రూ. 25వేలు నిధులు మంజూరు చేస్తుంది. అందులో భాగంగానే గత విద్యాసంవత్సరంలో సంబంధిత శాఖ నుంచి నిధులు విడుదలయ్యాయి. అయితే ఆ బడ్జెట్‌ను వారికిస్తూనే... ఓఓఈ ( అదనపు ఆఫీస్ ఖర్చులు) పేరుతో ఈ అధికారి మరో కొంత సొమ్మును అదనంగా మంజూరు చేసి, ఆ సొమ్మును వార్డెన్ల ఖాతాలో జమైన తర్వాత వారినుంచి తిరిగి తీసుకున్నాడు. ఆ విధంగా దాదాపు జిల్లాలో రూ.5లక్షల వరకు కుమ్మేసినట్టు సంబంధిత శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు.
ఆయనో వసూల్ రాజా
గతేడాది కరోనా వైరస్ స్వైరవిహారం చేయడంతో హాస్టల్ విద్యార్థులంతా ఇండ్లబాట పట్టారు. కానీ ఈ అధికారి మాత్రం వసతి గృహాల సందర్శన బాట పట్టిండు. దాదాపు ప్రతి హాస్టల్‌కూ వెళ్లారు. అయితే వెళ్లిన ప్రతి వార్డెన్ నుంచి రూ. 5000 ముక్కు పిండి వసూలు చేసినట్టు సమాచారం. పిల్లలే లేరు డబ్బులు ఎలా ఇస్తామని వార్డెన్లు అడిగితే బెదిరింపుల పర్వం మొదలైయింది. సర్వీస్ బుక్‌లో ఇంక్రిమెంట్లు నమోదు చేయాలని ఆ అధికారి వద్దకు పోతే ఒక్కొక్క వార్డెన్ వద్ద నుంచి సుమారు. రూ.20వేల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
- ప్రోహిబిషన్ పిరియడ్‌లో ఉన్న ఉద్యోగులు డిపార్టుమెంటు పరీక్షలు పాస్ కావాలి.. కానీ కొంతమంది ఉద్యోగులు పాస్ కాకపోవడంతో వారికి గ్రేడ్-1 పదోన్నతి కోసం జీవో తెప్పిస్తానని నలుగురు ఉద్యోగుల వద్ద సుమారు రూ.30వేల చొప్పున తీసుకున్నారని తెలుస్తుంది.
-వార్డెన్ల గ్రేడ్ సీనియారిటి జాబితాపై కోర్టులో స్టే విధించారు. కానీ ఈ అధికారి పదోన్నతి ఇప్పిస్తానని ముగ్గురు ఉద్యోగుల వద్ద సుమారు రూ.50వేల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం.
- కొత్తగా విధుల్లో చేరిన ఓ ఉద్యోగిని రూ.50వేలు ఇవ్వాలంటూ 4మిగతా 3లో...
ఆయనో వసూలు రాజా
వేదిస్తున్నట్టు తెలిసింది. తాను అంతగా ఇవ్వలేనని కొంత ఇస్తానని చెపుతున్న అడిగినంత ఇవ్వాల్సిందేనని బెదిరిస్తున్నట్లు సమాచారం.
-- హాస్టల్లో పనిచేస్తున్న ఓ పొరుగు సేవల మహిళ వర్కర్‌ను అకస్మాత్తుగా తొలగించి , ఆమె స్థానంలో మరో పురుషుడు వద్ద నుంచి రూ.2లక్షలు తీసుకుని
ఉద్యోగం కల్పించినట్లు సమాచారం.అంతేగాకుండా నల్లగొండ నుంచి హాలియాకు ఓ వర్కర్‌ను బదిలీ చేసినందుకు రూ.20వేలు తీసుకున్నాడని తెలుస్తుంది.
సిబ్బందిని బెదిరిస్తూ సంతకాల సేకరణ..?
జిల్లా అభివృద్ధి అధికారిపై దాదాపు వివిద విద్యార్థి, యువజన సంఘాల నుంచి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. దానికి స్పందించిన కలెక్టర్ వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చాలని ఓ జిల్లా అధికారిని విచారణాధికారిగా నియమించారు. అయితే ఆ అధికారి వాస్తవంగా సంబంధిత శాఖలో పనిచేస్తున్న సిబ్బందితో స్వయంగా మాట్లాడి వాస్తవాలను తెలుసుకోవాల్సి ఉంది. కానీ ఆరోపణలు వచ్చిన అధికారి, విచారణ చేయాల్సిన అధికారి మధ్య జరిగిన ఒప్పందం ఏంటో కానీ ....విచారణ ఫైల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి చేరింది. ఇప్పుడు అతనే విచారణాధికారిగా ఆవతారమెత్తాడని తెలిసింది. తాను ఏ తప్పు చేయలేదని అందుకు సంబంధించి తనకు అనుకూలంగా తయారు చేసిన నివేదికపై బెదిరిస్తూ బలవంతంగా చేయించుకుంటున్నారని సమాచారం. ఒకవేళ ఏవరైనా సిబ్బంది సంతకం చేయనంటే వారి సంగతి తేలుస్తానంటున్నారని వారు ఆందోళన చెందుతున్నారు.
అయితే ఈ సారూ... గతంలో సూర్యాపేట జిల్లాలో డివిజన్ స్థాయి అధికారిగా విధులు నిర్వర్తించాడు.. ఆ సందర్భంలో వార్డెన్లను ''జలగ'' మాదిరిగా పీల్చుకుతిన్నాడని ఆరోపణలు వచ్చాయి. వారు తట్టుకోలేక ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి ఆ అధికారి..వార్డెన్ల జోలికి రాకుండా ఉండేలా ఒప్పందం కూడా రాసుకున్నారని తెలిసింది. అంటే ఎలాంటి వసూళ్లకు పాల్పడేవాడో అర్థమవుతోంది.
ఇదేంటని విద్యార్థి, యువజన సంఘాలు ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెడతాననే బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అవినీతికి పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
వేదిస్తున్నట్టు తెలిసింది. తాను అంతగా ఇవ్వలేనని కొంత ఇస్తానని చెపుతున్న అడిగినంత ఇవ్వాల్సిందేనని బెదిరిస్తున్నట్లు సమాచారం.
-- హాస్టల్లో పనిచేస్తున్న ఓ పొరుగు సేవల మహిళ వర్కర్‌ను అకస్మాత్తుగా తొలగించి , ఆమె స్థానంలో మరో పురుషుడు వద్ద నుంచి రూ.2లక్షలు తీసుకుని ఉద్యోగం కల్పించినట్టు సమాచారం.అంతేగాకుండా నల్లగొండ నుంచి హాలియాకు ఓ వర్కర్‌ను బదిలీ చేసినందుకు రూ.20వేలు తీసుకున్నాడని తెలుస్తుంది.