Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరి రూరల్
జూలై ఒకటో తేదీ నుంచి పది రోజుల పాటు జిల్లాలో పల్లె ,పట్టణ ప్రగతి కార్యక్రమాలు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతంగా నిర్వహించారని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పది రోజుల పాటు జిల్లాలోని 421 గ్రామ పంచాయతీలను పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా 23 22 మురుగు కాలువల్లో పూడిక తీయాల్సిన గుర్తించి 2228 మురుగు కాలువలు తీసి, పరిశుభ్ర పరచినట్టు తెలిపారు. 3599 ప్రాంతాలలో సర్కార్ చెట్లు పొదలు ఇతర అనవసర వాటిని తొలగించాలని ఉండగా 3732 ప్రాంతాలలో తొలగించి పరిశుభ్రత వచ్చినట్టు పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న ప్లాట్లు కామన్ ప్రాంతాలలో2633గుర్తించి 2514 ప్లాట్లు కామన్ ఏరియాలో పరిశుభ్ర చర్యలు చేపట్టినట్టు దోమలు వ్యాప్తి జరిగే 3383 ప్రాంతాలను గుర్తించి బ్లీచింగ్ పౌడర్ ఇతర నివారణ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. 371 చానల్స్ కాలువలు పరిశుభ్ర పంచడంతోపాటు, 716 అంగన్ వాడీ కేంద్రాలు, 412 ప్రాథమిక పాఠశాలలు, 79 ఉన్నత పాఠశాలలు, 148 ఆరోగ్య కేంద్రాలు, 573 కమ్యూనిటీ హాల్లో పారిశుధ్య పనులను పూర్తి చేసినట్టు తెలిపారు. వీటితోపాటు ఆయా గ్రామాలలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రాంతాలలో పరిశుభ్రత చర్యలు చేపట్టి నట్లు తెలిపారు. 1403 త్రాగు నీటి వనరులు శుభ్రపరిచి నట్లు, 1321 త్రాగు నీటి ట్యాంకులు క్లోరినేషన్ చేపట్టినట్లు, 750 వాటర్ పైప్ లైన్ లీకేజ్ ఆరి కట్టినట్టు తెలిపారు. 81 పనిచేయని పాడై పోయిన బోర్వెల్స్ గుర్తించి, 66 పూర్తి చేసినట్లు తెలిపారు.146 పాత బావులను గుర్తించి పూడ్చి వేయడానికి అన్ని చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. 1312 వేలాడే విద్యుత్ తీగలు గుర్తించి 625 సరి చేసినట్లు తెలిపారు.1527 తుప్పు పట్టిన విరిగిన విద్యుత్ స్తంభాలను గుర్తించి 540 తొలగించినట్టు తెలిపారు. 2301 తాడు వైర్ పోల్స్ గుర్తించి,663 థర్డ్ వైర్ పనులు పూర్తి చేసినట్టు తెలిపారు.950 తాగు నీటి వనరులకు విద్యుత్ మీటర్లు అమర్చడానికి 565 విద్యుత్ మీటర్లు అమర్చినట్లు తెలిపారు.421 గ్రామ పంచాయతీలలో శ్రమదానం కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని,7,73,654 మొక్కలు ఇంటికి ఆరు చొప్పున పంపిణీ చేయడంతో పాటు, 421 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించగా 18700 గ్రామ ప్రజలు పాల్గొన్నట్లు తెలిపారు.9709 రోడ్లపైన పారిశుధ్య పనులు చేపట్టినట్టు తెలిపారు. 325 వైకుంఠ గ్రామాలు వినియోగంలోకి తెగ, నూట నలభై ఆరు చోట్ల బయో ఫెన్సింగ్ చేపట్టినట్టు తెలిపారు. 90256 మొక్కలను రెవెన్యూ ప్లాంటేషన్ పూర్తిచేసినట్టు ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ కింద 6480 కమ్యూనిటీ ప్లాంటేషన్ లో భాగంగా 67,051 మొక్కలు నాటిన ట్లు తెలిపారు.423 పల్లె ప్రకతి వనాలకు గాను గుర్తింపు జరిపి 412 పల్లె ప్రకతి వనాల్లో ప్లాంటేషన్ చేపట్టినట్టు తెలిపారు.20, 116 డొనేషన్ రూపంలో వచ్చినట్టు తెలిపారు.