Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మమ్మల్ని ఎవరు చూస్తారు
- అమ్మ పిలుస్తుంది రా నాన్న
- రోదిస్తున్న ఇద్దరు చిన్నారులు
నవతెలంగాణ-బొమ్మలరామారం
గుండెను కదిలించేలా చిన్నారుల మాటలతో కంట తడి పెడుతున్న గ్రామస్థులు.నాన్న ఇక రావా.. మమ్మల్ని ఎవరు చూస్తారు మేము ఎక్కడ ఉండాలి అంటూ ఆ ఇద్దరు చిన్నారులు రోదించిన తీరు గ్రామస్తులకు కంటతడి పెట్టించింది.తుర్కపల్లి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన జూపల్లి మహేష్ (35) కల్పనలకు ఇద్దరు కూతుళ్ళు అనాథలుగా మారారు. వత్తి రీత్యా జూపల్లి మహేష్ (35) లారీ డ్రైవర్గా పని పనిచేస్తూ జీవనం కోణాదిగిస్తుండటంతో కాలం కన్నెర్ర చేసి అనుకోకుండా గత వారం మహేష్ తన భార్య కల్పనతో కలిసి తన అత్తగారిల్లు బొమ్మల రామరం మండలం మర్యాల గ్రామానికి బైక్పై వస్తుండగా గుర్తుతెలియని వాహనం వెనుక నుండి ఢకొీట్టడంతో అక్కడికక్కడే మహేష్ మతిచెందాడు. కల్పనకు తీవ్ర గాయాలై హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇదిలా ఉండగా చిన్నారులు మాత్రం తల్లి దండ్రులు వస్తారని ఆశతో ఎదురుచూస్తూ చిన్ని చిన్ని మాటలతో గ్రామస్థులకు కంట తడి పెట్టిస్తున్నారు. కల్పన చేతికి కాలికి సర్జరీ కావడంతో భారీ మొత్తంలో ఖర్చు అయ్యింది. ప్రస్తుతం ఆ కుటుంభం ధీన స్థితిలో ఉండటం చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది.ప్రమాదానికి గురై తండ్రి ఎలాగో దూరమయ్యాడు కనీసం తల్లినైన బతికి తిరిగి రావాలని చిన్నారుల ఆవేదన చూస్తూ గ్రామస్థులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎవరైనా దాతలు ముందుకు రావాలని ఆ కుటుంబం వేడుకుంటుంది. కల్పన తండ్రి వెంకటేష్ గత నెల క్రితం కోతుల బెడద ఎక్కువ అవడంతో బిల్డింగ్ మీదకు వెళ్లి కోతులను కొట్టి తిరిగి వస్తుండగా మెట్ల పై నుండి జారి పడి వెంకటేష్ అక్కడికక్కడే మతి చెందాడు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఎవరూ లేకపోవడంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు చేతులెత్తి వేడుకుంటున్నారు.