Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సమస్యలు ఎలుగెత్తుతున్న సీపీఐ(ఎం)
- పీసీసీ అధ్యక్షులు కుంభంకి ఆదరణ
- ఎమ్మెల్యేకు ప్రజాబలం తగ్గడమే కారణమా?
నవతెలంగాణ - భువనగిరి
ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేవు. అయిన భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. దీనిపై నియోజకవర్గ ప్రజలు ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. పైళ్ళకు నియోజకవర్గంలో ఆదరణ తగ్గుతుదని వస్తున్న వార్తలు ఈ పర్యటనలకు కారణమా అనే చర్చ జరుగుతుంది. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు సీపీఐ(ఎం) ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై జిల్లావ్యాప్తంగా జిల్లా సమగ్ర అభివద్ధి కోసం సీపీఐ(ఎం)ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. కరోనా రెండవ దశలో నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఇంటి వద్దనే ఉంటూ ప్రత్యేక తరహాలో నిరసన తెలియజేశారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద కరోనా నిబంధనలను పాటిస్తూనే రైతులకు అండగా ఎర్ర జెండాలతో నిరసన తెలిపారు.ప్రజా ఆరోగ్యం మెరుగు పరచాలని ప్రజలకు వైద్య చికిత్స అందించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్, డీఎంహెచ్‌వో కార్యాలయం, ప్రభుత్వ జిల్లా కేంద్ర ఆసుపత్రి, బీబీనగర్ ఎయిమ్స్ వైద్యశాల ముందు తమ గళాన్ని వినిపించారు. కరోనా బారిన పడిన వారికి వైద్యం అందించడానికి ప్రత్యేక హెల్ప్‌లైన్ జిల్లా కేంద్రంతో పాటు ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కరోనా రెండవ దశలో ప్రజలకు అతి సన్నిహితంగా ఉంటూ సొంత ఖర్చులతో అంబులెన్స్ ఏర్పాటు చేశారు, అడిగిన వారికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ఉండలేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజలకు, జిల్లా కేంద్ర ఏరియా ఆస్పత్రికి , బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రికి ఆక్సిజన్ సిలిండర్లను సొంత ఖర్చులతో అందించి వైద్య చికిత్సలు చేయించారు. దీంతో ఒక్కసారిగా డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ పెరగడంతో పాటు ప్రజా సంబంధాలు మెరుగు పడ్డాయి. మరోవైపు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో లేడని పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగింది. ప్రజాదరణ తగ్గినట్లు సమాచారం. అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి పట్టణంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో కార్యకర్తలకు అండగా ఉంటూ పలు అంశాల్లో సూచనలు చేస్తూ ఐక్యమత్యంతో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు . కరోనా బాధితుల తో పాటు నియోజకవర్గంలో నిలిచిపోయిన పిల్లాయిపల్లి కాలువ మూసీ ప్రక్షాళన, ఇతర అభివద్ధి పనులను ప్రజలకు తెలియజేసి చైతన్యం నింపుతున్నారు. ఏరియా ఆస్పత్రికి డయాలసిస్ కు నిధులు మంజూరు చేయలేదంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేశారు.
ఎంపీతో ఇబ్బందులు
ఒకవైపు కుంభం అనిల్ రెడ్డి పక్కలో బల్లెంలా ఉండడం మరోవైపు రాజకీయాల్లో తలపండిన నాయకుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్న అభివద్ధి పనులు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
కలగలుపు...
ప్రజలలో తనకు ఆదరణ తగ్గిందని తెలుసుకున్నాడో, సీపీఐ(ఎం), కాంగ్రెస్ పార్టీ లకు ఆదరణ పెరుగుతుందని, బీజేపీకి వలసల జరుగుతున్నాయని భావించాడో ఏమో కానీ ఇటీవల ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు ప్రజలతో తిరుగుతూ కలగలుపుతో ఉంటున్నారు. ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నారు. కరోనా బారిన పడి మతి చెందిన కుటుంబాలకు సొంత ఖర్చులతో ఆర్థిక సహాయం అందిస్తున్నారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి ప్రభుత్వ సమావేశాలకు హాజరవుతున్నారు. ఎమ్మెల్యే పై అసంతప్తి ఉన్న వారితో మధ్యవర్తుల తో మంతనాలు చేయించి అక్కున చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అనుకూలంగా ఉన్న వాళ్ళతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ 8 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రజలతో ప్రజా అభివద్ధి కార్యక్రమంలో ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడాన్ని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతిస్తున్నారు.
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గతంలో ఎన్నడూ లేనివిధం పట్టణ , పల్లె ప్రగతి భాగంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, పట్టణ కేంద్రాల్లో ఇతర కార్యక్రమంలో జోరుగా తిరుగుతున్నారు. సుమారు పదిరోజుల పాటు నియోజకవర్గాన్ని విడిచిపెట్టకుండా తిరుగుతూ క్యాడర్లో ఆత్మ స్థైర్యం తెలుపుతూ తన బలాన్ని పెంచుకోవడానికి చేస్తున్నారు.