Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి
- రాష్ట్ర అటవి, దేవాదాయ శాఖ మంత్రి ఎన్ ఇంద్రకరణ్ రెడ్డి
నవతెలంగాణ- భువనగిరి
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలి అని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి ఎన్ ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డితో కలిసి ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాలో విస్తతంగా పర్యటించి అటవి భూములలో మొక్కలు నాటారు. భువనగిరి పట్టణంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన అటవి క్షేత్ర అధికారి నివాస భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామం చేరుకొని 121 ఎకరాల అటవీ భూములను ప్రారంభించి, మొక్కలు నాటారు. దామరచర్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను వీర్లపాలెం, దిలావర్పూర్ గ్రామాలకు చెందిన అటవీ భూములను ప్రభుత్వం సేకరించి టీఎస్ జెన్కోకు అప్పగించింది. అందుకు బదులుగా తుర్కపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 120లో గల 121 ఎకరాల ప్రభుత్వ భూమి పరిహారం కింద తిరిగి ప్రభుత్వం అటవీ శాఖకు కేటాయించింది. ఈ నేపథ్యంలో మంత్రులు సీ,ఏ బ్లాకులను ప్రారంభించి, మొక్కలు నాటారు. అనంతరం భువనగిరి పరిధిలోని రాయగిరి వద్ద అటవీశాఖ అభివద్ధి చేసిన ఆంజనేయ అర్యనం అర్బన్ పార్క్ చేరుకొని గతంలో నాటిన మొక్కలను పరిశీలించి, హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ అడవుల సంరక్షణ లో భాగంగా రాయగిరి అర్బన్ పార్క్లో నాటిన 30 వేల మొక్కలు పెరిగి మహావక్షాలుగా మారినట్టు తెలిపారు. ఇబ్రహీంపూర్లోని సీ, ఏ బ్లాక్ లో అటవీ భూముల అభివద్ధికి అన్ని చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. హరితహారం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం సంతరించుకుంది అన్నారు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నీచి వచ్చే వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో అడవుల శాతాన్ని 33 శాతానికి పెంచి లక్ష్యంతో చేస్తుందన్నారు. హరితహారం లో భాగంగా రాష్ట్రంలో పచ్చదనం 4 శాతం పెంపొందించినట్టు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి, జెడ్పీచైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కష్ణారెడ్డి, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శోభ, ప్రిన్సిపల్ సిసిఎస్ లోకేష్ జైస్వాల్, చీఫ్ కన్వర్టర్ ఆఫ్ ఫారెస్ట్ ఎంజె అక్బర్, డిఎఫ్ ఓ వెంకటేశ్వర్ రెడ్డి, ఎఫ్ ఆర్ వో లు, ఆర్డీవో భూపాల్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.