Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
నవతెలంగణ -సంస్థాన్‌నారాయణపురం
ఇప్పట్లో పార్టీ మారే ఆలోచన లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని జనగాం కొత్తగూడెం గ్రామాలతో పాటుపలు గిరిజన తండాల్లో నిర్మించతలపెట్టిన సీసీ రోడ్లు, చెత్త డంపింగ్ కేంద్రాలు పల్లె ప్రకతి వనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనన్నారు. పీసీసీ ఎంపిక విషయంలో అధిష్టానం రెండున్నరేండ్లు నాన్చిందన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడం ఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ రాజీనామా చేయడం పట్టి కాంగ్రెస్ బలహీనపడింది అట్లు వ్యాఖ్యలు చేసినట్టు ఒప్పుకున్నారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలు వాస్తవాలన్నారు. రెండేండ్లుగా పార్టీ కార్యక్రమాలకు తాను దూరంగా ఉంటున్నట్టు తానే ఒప్పుకున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలను బట్టి కార్యకర్తల అభీష్టం మేరకు భవిష్యత్తు నిర్ణయాన్ని తీసుకుంటానన్నారు. సోనియాగాంధీ సరైన సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసినప్పటికీ తెలంగాణలో నాయకత్వ లోపం వల్ల పార్టీకి నష్టం జరిగిందన్నారు. కేసీఆర్ నిధులు ఇవ్వనందున ఎటువంటి అభివద్ధి కార్యక్రమాలు చేపట్టే లేక పోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీపీ గుత్త ఉమాదేవి, జెడ్పీటీసీ విజయలక్ష్మి, సర్పంచులు కరంటోత్ జ్యోతి శ్రీను, సోమ్లా నాయక్ రెడ్యా నాయక్ బానోతు రజిత కిషన్ నాయక్ సునీతా సీతారాం నాయక్ దేవి లాల్ శంకర్ నాయక్ కలమ్మ, నాయకులు కరెంటు బిక్షపతి, బుజ్జి నాన్న నాయక్, నాయక్ ముద్దం నరసింహ సాగర్ ఉప్పల లింగస్వామి భద్ర గోని నరసింహ, మందు గల బాలకష్ణ, ఉన్నారు.