Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చిట్యాల
జీపీ కార్మికులకు కనీస వేతనం రూ.10వేలు ఇవ్వాలని సీఐటీయూజిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం జీపీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశం స్థానిక మార్కెట్‌యార్డులో ఎం.బాలమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలు, సంస్థలు,కార్పొరేషన్ లో పనిచేస్తున్న పర్మినెంటు ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ వేతనాలు పెంచుతూ జీవోలు ఇచ్చిందన్నారు. గ్రామపంచాయతీలో పనిచేసే వారిలో 90శాతం పైగా అట్టడుగు వర్గాలకు సంబంధించిన వారే ఉన్నారన్నారు. వారు కరోనా విపత్తులో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం తోపాటు, పల్లె ప్రగతి నిర్వహణలో పంచాయతీల అభివద్ధిలో అవిశ్రాంతంగా పనిచేస్తున్నారన్నారు. జీపీ కార్మికులను పీఆర్సీలో చేర్చి వేతనం రూ.19వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి నారబోయిన శ్రీనివాస్, యూనియన్ మండల అధ్యక్షులు వలిగొండ లింగయ్య, యూనియన్ నాయకులు అనుముల లక్ష్మయ్య, మోర స్వామి సువర్ణ, ఎలికట్టె నరసింహ, గణేష్, మల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.