Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం
- రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య
నవతెలంగాణ-నల్లగొండ
వ్యవసాయ కార్మికులను కులాలవారీగా పని చెప్పి వేతనాలు ఇవ్వాలనే ఆలోచనను విరమించుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం పట్టణంలోని ఎంవీఎన్విజ్ఞానకేంద్రంలో ఆ సంఘ ఆధ్వర్యంలో 'కులాల వారీగా వేతనాలివ్వడం రాజ్యాంగ విరుద్ధం' అనే ఆంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నారి అయిలయ్య మాట్లాడుతూ ఉపాధిహామీచట్టంలో ఐక్యంగా పని చేస్తున్న కూలీల మధ్య ఘర్షణ సృష్టించడానికి మోడీ ప్రభుత్వం జీఓ తెచ్చిందని విమర్శించారు.పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు పన్నిన ఈ కుట్రను కార్మిక, ప్రజాసంఘాలు, సామాజికసంఘాలు చట్ట రక్షణ కోసం పోరాడాలని కోరారు.వెంటనే ఈచట్టాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆడ,మగ అనే తేడా లేకుండా సమానపనికి సమానవేతనం ఇవ్వాలనే చట్టం డైరెక్షన్‌కు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు.దళితులకు ఉపప్రణాళిక కేటాయింపులు ద్వారా వేతనాలిస్తామని చెప్పడం మోసమేనన్నారు.గ్రామీణ అభివద్ధి శాఖ కేటాయించే నిధులలో ఉపప్రణాళికకు వచ్చే వాటా నామినల్ అని అడిగిన వారికల్లా పని ఇవ్వాలనే చట్టం డైరెక్షన్‌ను అమలు చేయడం సాధ్యం కాదన్నారు.కరోనాతో పట్టణ ప్రాంతాల్లో ఉన్న కార్మికులు గ్రామాలకు వెళ్తున్నారని,వారందరికీ పని కలిపించాలంటే పనిదినాలు పెంచాలని కోరారు.పట్టణ ప్రాంతాల్లోకి విస్తరణ చేయాలని, రోజు కూలీ పెరుగుతున్న ధరలకనుగుణంగా వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు దండంపల్లి సరోజ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎడ్లసైదులు,సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధానకార్యదర్శి మల్లం మహేష్, రైతు సంఘం జిల్లా నాయకులు కుంభం కష్ణారెడ్డి, ఐద్యా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి, డీవైఎఫ్ఐ పట్టణ అధ్యక్షలు గుండాల నరేష్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నలపరాజు సైదులు, రఘువరణ్, రేణుక పాల్గొన్నారు.