Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి అయిలయ్య
నవతెలంగాణ - చింతపల్లి
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి అయిలయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటికే 46 సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై మోయలేని భారం వేసిందన్నారు. ధరలు పెరగడంతో ట్రాన్స్పోర్టు చార్జీలు కూడా పెరుగుతున్నాయని, ఫలితంగా పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో అన్ని ఉత్పత్తుల రేట్లూ పెంచిన ఏకైక దేశం భారతదేశం అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి అనంద్, మండల కార్యదర్శి ఉడుగుండ్ల రాములు, సభ్యులు పోలె యాదయ్య, మాదగోని యాదయ్య, కడారి బాలయ్య, సర్దార్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.