Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీకా కోసం ఎగబడ్డ జనం
నవతెలంగాణ -రామన్నపేట
పాలకుల నిర్ణయం వల్ల వ్యాక్సినేషన్ చేయడం కోసం అటు అధికారులు, వ్యాక్సింగ్ చేయించుకోవడం కోసం ఇటు జనం ఇబ్బందులు పడక తప్పడం లేదు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని, టీకా పై అపోహలు వీడాలని ప్రభుత్వం విస్తతంగా ప్రచారం చేసింది. ఆ మేరకు ఏర్పాట్లు చేయకపోవడంతో మండల ప్రజలు వ్యాక్సినేషన్ కోసం ఆస్పత్రికి వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాక్సినేషన్ అందక వెను తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గురువారం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో వందలాది మంది జనం వ్యాక్సినేషన్ కోసం ఎగబడటంతో అధికారులు, సిబ్బంది నియంత్రించలేక పోలీసుల సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో గతంలో వేసిన మాదిరిగా టీకాలు వేయాలని ప్రజలు కోరుతున్నారు. వద్ధుల పరిస్థితిిిి మరింత దారుణంగా ఉంది. టీకా కోసం వచ్చిన వద్ధులు. ఇక అంధక నాన్షా అవస్థలు పడ్డారు. మొదటి డోస్ వ్యాక్సినేషన్ కోసం, రెండవ డోస్ వ్యాక్సినేషన్ కోసం వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.