Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
కార్మిక నాయకుడిగా మంచి పేరున్న వ్యక్తి వాడపల్లి వెంకటేశ్వర్లు అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.గురువారం పట్టణంలోని గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్హాల్లో మాజీ సర్పంచ్ వాడపల్లి సంతాపసభ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలతో సుదీర్ఘ కాలంగా ఎన్నో సంబంధాలు ఉన్న మంచి వ్యక్తిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.పట్టణంలో వాడపల్లి విగ్రహానికి తప్పకుండా తన వంతు కషి చేస్తానన్నారు.ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నాగన్న మాట్లాడుతూ కార్మికులకు అండగా ఉండి మంచినాయకుడిగా పేరు సంపాదించుకున్నారు.కార్యక్రమం నిర్వాహకులు మాజీ ఎంపీపీ ఓరుగంటిపాండు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా పార సీతయ్య వహించి మాట్లాడుతూ సీనియర్ నాయకుడు వాడపల్లి అన్న చనిపోవడం పార్టీకి తీరని లోటన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు సీహెచ్. లక్ష్మీనారాయణరెడ్డి, వంగవీటి రామారావు, నహీం, డేగబాబు,అల్తాఫ్ హుసేన్, ఎంపిపీ చింతాకవిత, పశ్యపద్మ, రామినేని శ్రీనివాసరావు, డాక్టర శ్రీపతిరెడ్డి, ఆవులరామారావు, పైడిమర్రి వెంకటనారాయణ, వాడపల్లి స్టాలిన్, ఎం.శ్రీనివాస్, చంద్రశేఖర్, మేకల శ్రీనివాస్, సూర్యం, తోటశ్రీను, వనపర్తిలక్ష్మీనారాయణ, ముత్యాలు, బొలిశెట్టి కష్ణయ్య, పాలూరి పాల్గొన్నారు.