Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బయటపడ్డ నాసిరకం పనులు...అధికారుల పర్యవేక్షణ కరువు
నవతెలంగాణ-వేంసూరు
లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న డ్రైనేజ్ పనులు పూర్తి కాకుండానే కూలిపోయిన సంఘటన వేంసూరు మండలం మర్లపాడులో జరిగింది. గ్రామ పంచాయతీ నిధులతో రూ.10 లక్షల వ్యయంతో 165 మీటర్ల పొడవుతో చేపట్టిన డ్రైనేజీ పనుల్లో నాణ్యత లోపించడంతో కొద్దిపాటి వరదకే కుంగిపోయింది.ఉదయం పూట సెంట్రింగ్ పెట్టి సాయంత్రానికి సెంట్రింగ్ తీసి వేశారని షాపులముందు వ్యాపారులు అంటున్నారు. పనులు జరిగే ప్రదేశానికి సంబంధిత అధికారులు వచ్చిన దాఖలాలు లేవని, కూలిపోయిన వెంటనే కొంతమంది మట్టి పోసి కనిపించకుండా చేశారని ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేపట్టిన వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని, కాంట్రాక్టర్ మూలంగా తీవ్రంగా నష్టపోయామని షాపుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పనులపై గ్రామానికి చెందిన కొంతమంది జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పిఆర్ ఏఈ వాసుదేవ రాజును నవతెలంగాణ వివరణ కోరగా పనులు జరిగిన వెంటనే మట్టి పోయడంతో ఒత్తిడికి డ్రైనేజీ కూలిపోయిందని తెలిపారు.