Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటిరంగారెడ్డి
నవతెలంగాణ-మాడ్గులపల్లి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం స్థానికంగా సీపీఐ(ఎం) మండల ద్వితీయ మహాసభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందన్నారు.కరోనా సమయంలో ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వాలు విస్మరించాయన్నారు.సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టామన్నారు.ఈ మహాసభలే వేదికగా యువత, ప్రజలు ఉద్యమాలు నిర్వహించాలన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశ్, నాయకులు పాలడుగు నాగార్జున, మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్, పుల్లెంల శ్రీకర్, దేవిరెడ్డి అశోక్‌రెడ్డి, పతాని శ్రీను, ఎర్ర కన్నయ్య, ఊరుగొండ శ్రీను, జూకూరి నాగయ్య పాల్గొన్నారు.
ప్రజా ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం
ప్రజా ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమౌతాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక రవీంద్రనగర్‌లో గణేష్‌నగర్, ప్రకాష్‌నగర్, హనుమాన్‌పేట, రవీంద్రనగర్, నందిపాడు సీపీఐ(ఎం) శాఖా మహాసభలు దేశీరాం, బావండ్ల పాండు, మాతంగి నర్సయ్యల అధ్యక్షతన నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, ప్రజలపై భారాలు మోపుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా కార్పోరేట్ శక్తులకు దోచిపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.ఎర్రజెండా నాయకత్వంలోనే సమస్యలు పరిష్కారమౌతాయని, ఆ దిశగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. వార్డు, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి పాటుపడాలన్నారు. శాఖ సమావేశాలు నిరంతరం నిర్వహిస్తూ స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.అన్ని వార్డుల్లో మహాసభలు పూర్తి చేయాలని కోరారు.ఈ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశ్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి నూకల జగదీశ్చంద్ర, జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, ఎం.రవినాయక్, బావండ్ల పాండు, దేశీరాంనాయక్, నంద్యాల కృపాకర్‌రెడ్డి, పి.సత్యనారాయణరావు, వీరయ్య, నిరంజన్, కోటయ్య, సోమయ్య, సాంబనాయక్, రామచంద్రు, సరోజన, లింగయ్య, పగిడోజు రాంమ్మూర్తి పాల్గొన్నారు.