Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐతగోని విజరుకుమార్
నవతెలంగాణ-మునగాల
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం యువత ఉద్యమించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐతగోని విజరుకుమార్ పిలుపునిచ్చారు.ఆదివారం ఆయన సూర్యాపేట జిల్లా మునగాల మండలకేంద్రంలో నిర్వహించిన డీవైఎఫ్ఐ జిల్లా ప్రథమమహాసభలనుద్దేశించి మాట్లాడారు.2014లో 5.61గా ఉన్న నిరుద్యోగ శాతం ప్రస్తుతం మోదీ పాలనలో 37.7 శాతానికి పెరిగిందన్నారు.అందులో 24 ఏండ్లలోపు వారే 37 శాతం మంది ఉన్నారని గుర్తు చేశారు.ఎన్నికలకు ముందు ఏటా 2లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తానన్న హామీ ఎమైందని ప్రశ్నించారు.రాష్ట్రంలో ఓటీఆర్ ద్వారా 2482888 మంది దరఖాస్తు చేసుకోగా ఉద్యోగాలు పొందిన వారు మాత్రం 31052 మంది మాత్రమే ఉన్నారన్నారు.రాష్ట్రంలో 2014లో 7.3 శాతం వుండగా అది ప్రస్తుతం 33.3శాతానికి పెరిగిందన్నారు.రాష్ట్రంలో సాక్షరభారత్ కోఆర్డినేటర్స్ 21200 మంది ఇంకా ఫీల్డ్అసిస్టెంట్లు 7651, మిషన్ భగీరథలో 709, హార్టికల్చర్లో 315, విద్యావాలంటీర్లు16400, స్టాప్నర్సులు 1640 మంది, పంచాయతీ కార్యదర్శులు రెండు వేల మంది మొత్తంగా 52515 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ మహాసభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు, జిల్లా కమిటీ సభ్యులు జె.నర్సింహారావు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దేవరం వెంకటరెడ్డి, డీవైఎఫ్ఐ నాయకులు గడ్డం వినోద్, కాసాని కిశోర్, రాజేష్, జాహంగీర్, వీరబాబు పాల్గొన్నారు.