Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హుజూర్నగర్:దళితులను మోసం చేసేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకం పేరుతో కొత్తనాటకానికి తెర తీశారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం పట్టణంలో ని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.కేసీఆర్ దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపించారు.కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని విమర్శించారు. గతంలో ఎస్సీ సబ్‌ప్లాన్‌కు కేటాయించిన నిధులను కూడా ఇతర రంగాలకు మళ్లించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.రాష్ట్ర క్యాబినెట్లో ఒక్క శాతం కూడా లేని సీఎం తన కుటుంబంలో నలుగురికి మంత్రి పదవులు కేటాయించారన్నారు.మొత్తం బడ్జెట్లో రూ.1.50 లక్షల కోట్లు కేటాయిస్తే దళితుల అభివృద్ధి సాధ్యమవు తుందన్నారు. 2023 తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోతుందని జోస్యం చెప్పారు.కష్ణా,గోదావరి బేసిన్ లో నీరు సమద్ధిగా ఉన్నందున నాగార్జునసాగర్ ఎడమకాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు.హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రౌడీయిజానికి పాల్పడుతున్నారని,ఆయన అనుచరులు ఇసుక దందా,ఇతర వ్యాపారాలలో అధికార యంత్రాంగం కూడా కలిసి పనిచేస్తుందన్నారు.గుర్రంపోడు భూముల విషయంలో కేసులు పెట్టిన పోలీసులు హుజూర్‌నగర్‌లో రాజ్ న్యూస్ విలేకరిపై దాడి చేసిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని ఆరోపించారు.ఎంపీ సంతోష్‌కుమార్ చెప్పిన విధంగానే పోలీసులు వింటున్నారని, అది పోలీసులకు మంచిది కాదన్నారు.సీఎంకేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర మంత్రులు మోడల్‌కాలనీకి నిధులు కేటాయించి పూర్తి చేస్తామని చెప్పి ఏండ్లు గడుస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు.