Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు
నవతెలంగాణ-తిరుమలగిరి
ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రజల పక్షాన నిలబడేది ఎర్రజెండా అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు అన్నారు.మండలంలోని తాటిపాముల గ్రామంలో పార్టీ శాఖ మహా సభ నిర్వహి ంచారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యం మనుగడ కోసం ఏండ్ల తరబడిగా ప్రజల పక్షాన నిలబడి, పార్టీ నాయకులు పోరాడుతున్నారని చెప్పారు.నాటి రజాకార్లను తరిమికొట్టిన ఘనత ఎర్రజెండా పార్టీకి ఉందన్నారు.ఆనాడు భూస్వాములను దొరలను ఎదిరించి పేద ప్రజల పక్షాన నిలబడిన పార్టీ అని చెప్పారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజల పైన ధరల భారం మోపుతున్నాయని చెప్పారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్నదని విమర్శించారు.రైతు, కార్మికవ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతులకు, కార్మికులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రభుత్వం అనుసరి స్తోందన్నారు.పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై ఆర్థికభారం మోపిందన్నారు.ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కొత్త కొత్త జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శిం చారు.దేశంలో, రాష్ట్రంలో వామపక్షాలు బలంగా ఉంటేనే ప్రజాసమస్యలు పరిష్కార మవుతాయని, ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతామన్నారు.ఈ సందర్భంగా శాఖ కార్యదర్శి బందెల అబ్రహాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో భూపతి వెంకటేశ్వర్లు,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, మండల కార్యదర్శి కడెం లింగ య్య, సభ్యులు బందెల అబ్రహం, నర్సయ్య, వెంకటయ్య, సోమయ్య, రాములు పాల్గొన్నారు.
ప్రజలను దోపిడీ చేస్తున్న ప్రభుత్వాలు
కరోనా కష్టకాలంలో ప్రజలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల భారంతో నిలువు దోపిడీ చేస్తున్నాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు విమర్శించారు. మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డులో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ అన్ని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 9న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని కోరారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలపై ధరల భారం మోపిందని అన్నారు.అంతేకాకుండా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి ప్రజల పైన ఆర్థిక భారాన్ని మోపిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులకు అన్యాయం చేస్తూ కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రజలను గాలికి వదిలేసిందని చెప్పారు. ఎన్నికల రాగానే హామీ ఇవ్వడం ఎన్నికలు అయి పోగానే వాటిని మరచిపోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి యాదగిరి రావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండ వెంకట్ రెడ్డి, బుర్ర శ్రీను, పులుసు సత్యం, సుదర్శన్, భాస్కర్ పాల్గొన్నారు.