Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
ప్రభుత్వం హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో తీసుకు వచ్చిన దళిత సాధికారత పథకం దళితులను మోసం చేయడానికేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లునాగార్జునరెడ్డి అన్నారు.ఆదివారం మండలంలోని పెంచి కల్దిన్న గ్రామశాఖా మహాసభలో ఆయన మాట్లాడారు.దళితులపై కేసీఆర్‌కు కపట ప్రేమ మాత్రమేనని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, దళితులకు 3 ఎకరాల భూమి, తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడేనన్నమాటకు కట్టుబడి లేదన్నారు. ప్రయివేట్‌రంగంలో రిజర్వేషన్లు, బ్యాక్లాగ్ పోస్టులు నింపే విషయంలో దళితుల మీద కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శన మన్నారు.కౌలు రైతులకు ఎరువులు క్రీమిసంహారక మందులు ఉచితంగా అందించాలని, 58 ఏండ్ల వరకే రైతుబీమా అందజేస్తున్నారన్నారు.వయస్సుతో సంబంధం లేకుండా రైతులందరికీ బీమా వర్తింపజేయాలని కోరారు.సబ్ప్లాన్నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కొదమగుండ్ల నగేష్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మరి నాగేశ్వరరావు, పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి అల్వాల శ్రీధర్,నాయకులు నందమూరి బాబురావు, కర్నాటి మురళీ, జీడిమెట్లరవి, బొప్పన రాణి, కొదమగుండ్ల సైదమ్మ, పాలకూరి రాములమ్మ, రేవెల్లి భిక్షం పాల్గొన్నారు.