Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వానొస్తే ప్రాకార మండపాలు కురుస్తున్నయి
- డంగు సున్నం, సిమెంట్ సరిగాలేకనే లీకులు
- భధ్రత లేక ధ్వజస్తంభం కర్ర పగుళ్లు
- అసలు గ్రీనరీ తీసేయడం ఎందుకు...తిరిగి పునరుద్ధరచడం దేనికి...
నవతెలంగాణ-యాదాద్రి
ఇటీవల కురిసిన ముసురుకే యాదాద్రి టెంపుల్ బయట ప్రాకార మండపాల భాగమంతా కురుస్తోంది. ఇక మెయిన్ టెంపుల్లోపుల పరిస్థితి ఎలా ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. లోపాలను బయట పెట్టి ఆఫీసర్ల తప్పొప్పులను కనిపెట్టే మీడియాకు కూడా ఆ చాన్స్ లేకుండా చేయడమే ఇక్కడ అసలు విషయం. ఎంట్రీ ఉంటేనే కదా మెయిన్ టెంపుల్ లోపల లీకేజీల విషయం తెలిసే చాన్స్ ఉండేది. కాగా ప్రస్తుతం వానొస్తే చాలు పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల్లో అష్టభుజి ప్రాకారాలన్నీ కురుస్తున్నాయి. వర్షం పడినంత సేపు ఈ మండపాల నుండి నీళ్లు కారుతూనే ఉంటాయి. ప్రాకారాల నిర్మాణానికి ఉపయోగించిన కృష్ణ శిలల మధ్య గ్యాబ్ పూడ్చడానికి డంగు సున్నం, సిమెంటు కలిపి రుద్దుతున్నారు. ఈ డంగు సున్నం, సిమెంటు మిశ్రమం కలపడంలోనే నాసిరకం ఉందని స్థానికంగా ప్రధాన ఆరోపణ ఉంది. ఇక్కడ వాడే డంగు సున్నం, సిమెంట్ అసలు నాణ్యమైనదేనా అనే డౌట్ కూడా స్థానికంగా వ్యక్తమవుతోంది. ఈ మిశ్రమం నాసిరకం కావడం మూలంగానే వాన కాలంలో తరచూ లీకేజీలు బయటపడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. .ఈ లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇంకా పనులు పూర్తి కాలేదని వైటీడీఏ ఆఫీసర్లు ప్రతిసారి కుంటిసాకును చూపుతూ తప్పించుకోవడం పరిపాటిగా మారింది. పూర్తి కృష్ణ శిలల రాయితో నిర్మితమైన ఈ టెంపుల్ వెయ్యేండ్లు మన్నికగా ఉంటుందని గతంలోనే సీఎం కేసీఆర్ వెల్లడించడం గమనార్హం. అష్టబుజ్జి ప్రాకార మండపం నుండి ఇలా వాన నీరు కారుతున్న పరిస్థితులతో ఈ టెంపుల్ మన్నికపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం టెంపుల్ ఓపెనింగ్ కాబోతున్న తరుణంలో ఇలాంటి లీకేజీలతో మున్ముందు భక్తులు ఇబ్బంది పడే చాన్స్ ఉంది. ఇదివరకు కురిసిన వర్షాలకు అద్దాల మండపం లీకేజీ సరిచేయగా తిరిగి వానాకాలం వచ్చే లోపు అష్టభుజి ప్రాకారాల మండపాలు కురవడంతో ఆఫీసర్ల పనితీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ గ్రీనరీ తొలగింపు ఎందుకు....
రెండు రోజుల క్రితం నుండి టెంపుల్ తూర్పు, ఉత్తరం దిక్కున ఉన్న గ్రీనరీని తొలగించి..దానిపైనే కొత్తగా గ్రీనరీని ఏర్పాటు చేస్తున్నారు. అసలు ఆ గ్రీనరీని తొలగించడం ఎందుకు తిరిగి పునరుద్ధరించడం దేనికి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఫ్లోరింగ్ జాయింట్ వర్క్స్ ఇంకా....
ఇదిలా ఉండగా మెయిన్ టెంపుల్ ఉత్తర దిక్కులో తరచూ ప్లోరింగ్ జాయింట్లు మూసి వేయడం జరుగుతుంది. ఇక్కడ జరిగే పనులు నాసిరకం కాకుండా ఎన్నిసార్లు ఈ ప్లోరింగ్ పనులు చేస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. వానలు కురిసిన ప్రతిసారి ఇక్కడ ఇదే తంతు కొనసాగుతోంది. ఇందులో డంగు సున్నం, సిమెంటు మిశ్రమం నాసిరకం కావడం చేతనే తరచూ ప్లోరింగ్ మరమ్మత్తులు సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ధ్వజస్తంభ కర్ర....
కాగా కొండపైన శివాలయం నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. ఈ క్రమంలో ధ్వజస్తంభం ఏర్పాటు కోసం తెచ్చిన కర్రకు ఎలాంటి భద్రత చర్యలు చేపట్టకపోవడంతో (సీకీపోయింది) పగుళ్లు వచ్చింది. వానలో నానుతూ ఎండలో ఎండుతుండటంతో ఈ కర్రకు ఈ దుస్థితి వచ్చిందని స్థానిక భక్తులు అంటున్నారు. దిక్కుల్లో అష్టభుజి ప్రాకారాలన్నీ కురుస్తున్నాయి. వర్షం పడినంత సేపు ఈ మండపాల నుండి నీళ్లు కారుతూనే ఉంటాయి. ప్రాకారాల నిర్మాణానికి ఉపయోగించిన కృష్ణ శిలల మధ్య గ్యాబ్ పూడ్చడానికి డంగు సున్నం, సిమెంటు కలిపి రుద్దుతున్నారు. ఈ డంగు సున్నం, సిమెంటు మిశ్రమం కలపడంలోనే నాసిరకం ఉందని స్థానికంగా ప్రధాన ఆరోపణ ఉంది. ఇక్కడ వాడే డంగు సున్నం, సిమెంట్ అసలు నాణ్యమైనదేనా అనే డౌట్ కూడా స్థానికంగా వ్యక్తమవుతోంది. ఈ మిశ్రమం నాసిరకం కావడం మూలంగానే వాన కాలంలో తరచూ లీకేజీలు బయటపడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. .ఈ లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇంకా పనులు పూర్తి కాలేదని వైటీడీఏ ఆఫీసర్లు ప్రతిసారి కుంటిసాకును చూపుతూ తప్పించుకోవడం పరిపాటిగా మారింది. పూర్తి కృష్ణ శిలల రాయితో నిర్మితమైన ఈ టెంపుల్ వెయ్యేండ్లు మన్నికగా ఉంటుందని గతంలోనే సీఎం కేసీఆర్ వెల్లడించడం గమనార్హం. అష్టబుజ్జి ప్రాకార మండపం నుండి ఇలా వాన నీరు కారుతున్న పరిస్థితులతో ఈ టెంపుల్ మన్నికపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం టెంపుల్ ఓపెనింగ్ కాబోతున్న తరుణంలో ఇలాంటి లీకేజీలతో మున్ముందు భక్తులు ఇబ్బంది పడే చాన్స్ ఉంది. ఇదివరకు కురిసిన వర్షాలకు అద్దాల మండపం లీకేజీ సరిచేయగా తిరిగి వానాకాలం వచ్చే లోపు అష్టభుజి ప్రాకారాల మండపాలు కురవడంతో ఆఫీసర్ల పనితీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ గ్రీనరీ తొలగింపు ఎందుకు....
రెండు రోజుల క్రితం నుండి టెంపుల్ తూర్పు, ఉత్తరం దిక్కున ఉన్న గ్రీనరీని తొలగించి..దానిపైనే కొత్తగా గ్రీనరీని ఏర్పాటు చేస్తున్నారు. అసలు ఆ గ్రీనరీని తొలగించడం ఎందుకు తిరిగి పునరుద్ధరించడం దేనికి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఫ్లోరింగ్ జాయింట్ వర్క్స్ ఇంకా....
ఇదిలా ఉండగా మెయిన్ టెంపుల్ ఉత్తర దిక్కులో తరచూ ప్లోరింగ్ జాయింట్లు మూసి వేయడం జరుగుతుంది. ఇక్కడ జరిగే పనులు నాసిరకం కాకుండా ఎన్నిసార్లు ఈ ప్లోరింగ్ పనులు చేస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. వానలు కురిసిన ప్రతిసారి ఇక్కడ ఇదే తంతు కొనసాగుతోంది. ఇందులో డంగు సున్నం, సిమెంటు మిశ్రమం నాసిరకం కావడం చేతనే తరచూ ప్లోరింగ్ మరమ్మత్తులు సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ధ్వజస్తంభ కర్ర....
కాగా కొండపైన శివాలయం నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. ఈ క్రమంలో ధ్వజస్తంభం ఏర్పాటు కోసం తెచ్చిన కర్రకు ఎలాంటి భద్రత చర్యలు చేపట్టకపోవడంతో (సీకీపోయింది) పగుళ్లు వచ్చింది. వానలో నానుతూ ఎండలో ఎండుతుండటంతో ఈ కర్రకు ఈ దుస్థితి వచ్చిందని స్థానిక భక్తులు అంటున్నారు.