Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రహదారులు చెడిపోయి అవస్థలు పడుతున్నం
- చెరువులు గండ్లు పడినా అధికారులు పట్టించుకోరు
- స్థానిక సంస్థల బాధ్యుల ఆవేదన
- ఎస్సీ పోస్టులో బీసీలకు ఉద్యోగమా... ఎమ్మెల్యే కిషోర్ ఫైర్
- ప్రజాప్రతినిధులను గౌరవించకపోతే చర్యలు తప్పవు.. మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం స్థానిక కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ, ఎంపీపీలు గ్రామాలలో పేరుకుపోయిన సమస్యలు, ప్రజల ఇబ్బందులను పూసగుచ్చినట్టు వివరించారు. వాటిని పరిష్కరిస్తామని ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి ఉన్నతాధికారులు హామీ ఇచ్చినప్పటికి ఏ మేరకు జరుగుతాయే చూడాల్సిందే.
మీటర్ కోసం నెలల తరబడి ఎదురుచూపులా...
చౌటుప్పల్‌లో 60మంది విద్యుత్ మీటర్ల కోసం డీడీలు చెల్లించగా, సుమారు 600 విద్యుత్ స్తంభాల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నామని, విద్యుత్‌శాఖ మంత్రి ఉన్న జిల్లాలోనే ఇలా అయితే ఎట్లా అని చౌటుప్పల్ జెడ్పీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే గ్రామాలలో అభివృద్ధి పనులు చేయక ఊర్లకు వెళ్లాలంటే సిగ్గుపడుతున్నం... చెట్లు నాటితే అభివృద్ధి ఎలా అవుతుందని ఆయన నేరుగా మంత్రి ముందే తన ఆవేదనను వ్యక్తం చేశారు. భువనగిరి, యాదగిరిగుట్ట మండలంలోని అనేక గ్రామాలలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందన్నారు. విద్యుత్ ప్రమాదాల వల్ల ఇప్పటికే చాలా చోట్ల సుమారు 15మంది వరకు చనిపోయారని ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.
రహదారుల సమస్యలకు మోక్షం లేదా...?
జిల్లా వ్యాప్తంగా అనేక రహదారులు చెడిపోయి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.భువనగిరి- రామన్నపేట రోడ్డు, అడ్డగూడురు మండలంలోని చౌళ్లరామారం- జానకిపురం , యాదగిరిగుట్ట - పెద్దకందూరు రోడ్లే గాకుండా ఇతర చోట్ల కూడా ఘోరంగా దెబ్బతిన్నాయని జెడ్పీటీసీ, ఎంపీపీలు ఆవేదన వ్యక్తం చేస్తూ, 4మిగతా 3లో...
అభివృద్ధిలేక గ్రామాలకు వెళ్లాలంటే..సిగ్గుపడతున్నం
ఎపుడు పని పూర్తిచేస్తారని అధికారులను నీలదీశారు.
రూ.1.67కోట్ల పరిహారం సొమ్ము ఏమైనట్టు
ఉమ్మడి జిల్లాలో రామన్నపేట మండలం పరిధిలో పిలాయిపల్లి కాల్వకు భూమి ఇచ్చిన రైతులకు చెల్లించాల్సిన రూ.1.67కోట్ల సొమ్ము ఏ జిల్లాలో ఉందో అర్థంకాని పరిస్థితి. నల్లగొండ, యాదాద్రి కలెక్టర్లు తమ వద్దలేవని పేర్కొంటున్నారు. ఆ నిధులు ఏమయ్యాయో చెప్పాలని నకిరేకల్ ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు.
అధికారుల పనితీరుకు ఇవే నిదర్శనం.....
భీభత్సమైన వర్షాలు వచ్చి చెరువులు, కుంటలు తెగిపోతే ఇరిగేషన్ అధికారులు ఒకరిపై మరోకరు 'నా పరిధి కాదంటే... నా పరిధి కాదు'అని చెపుకోవడంతో వారి పనితీరు స్పష్టంగా కనిపిస్తుంది. అవి తెగి పంటలు, గ్రామాల ప్రజలకు నష్టం జరుగుతుందని తెలిసినా కనీస స్పందన లేకపోతే వాళ్లేమి విధులు నిర్వర్తిస్తున్నట్టు ప్రజలకు మేలు కోరే తీరు అదేనా....
ఎస్సీ పోస్టులో .. బీసీకి ఉద్యోగమా...?
ఎస్సీ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో ఉద్యోగాల భర్తీలో అధికారుల ఇష్టారాజ్యంగా ఉంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ చేయబడింది.. కానీ అక్కడ రంగారెడ్డి జిల్లాకు చెందిన బీసీ అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చారంటే వారి ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన ఎలా ఉందో అర్థమవుతుంది. దీనిపట్ల తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అధికారిపై ఫైర్ అయ్యారు. అంతేగాకుండా తనకు తెలియకుండా పాఠశాలను ఎలా తరలిస్తారని నిలదీశారు.
సభను నిశితంగా గమనించిన కలెక్టర్...
యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జేడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరు కావడం మొదటిసారి. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ఇదిలా ఉంటే సమావేశం జరుగుతున్న సమయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను నేరుగా పరిచయం చేసుకుని వారు చెప్పిన ప్రతి అంశాన్నీ నోట్ చేసుకున్నారు. సభ్యులు మాట్లాడే ప్రతి అంశాన్నీ, సభ జరుగుతున్న తీరును నిశితంగా గమనించారు. ఇప్పటికే తన మార్క్ జిల్లాలో చూపించాలని వేగంగా అడుగులు వేస్తున్న కలెక్టర్ సభ్యుల సమస్యలను పరిష్కరిస్తే మరింత వేగంగా నేరుగా ప్రజలకు మేలు జరగనుంది.
ప్రజాప్రతినిధులను గౌరవించకపోతే కఠిన చర్యలు
విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులను గౌరవించకపోతే కఠిన చర్యలు తప్పవు. హెచ్చరించారు. ఎవరికివ్వాల్సిన గౌరవాన్ని వారికిస్తూనే...వారి నుంచి అదే రీతిలో పొందాలి. ఏ మండల సమావేశాలకు అధికారులకు అనుమతి లేకుండా హాజరు కాకపోతే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. విద్యుత్ ప్రమాదాల వల్ల ఎవరైనా చనిపోతే వారికి సంబంధిత శాఖ నుంచి నష్టపరిహారం అందుతుంది. బాధితులకు అవగహన కల్పిస్తే మేలు జరుగుతుంది. ఎపుడు పని పూర్తిచేస్తారని అధికారులను నీలదీశారు.
రూ.1.67కోట్ల పరిహారం సొమ్ము ఏమైనట్టు
ఉమ్మడి జిల్లాలో రామన్నపేట మండలం పరిధిలో పిలాయిపల్లి కాల్వకు భూమి ఇచ్చిన రైతులకు చెల్లించాల్సిన రూ.1.67కోట్ల సొమ్ము ఏ జిల్లాలో ఉందో అర్థంకాని పరిస్థితి. నల్లగొండ, యాదాద్రి కలెక్టర్లు తమ వద్దలేవని పేర్కొంటున్నారు. ఆ నిధులు ఏమయ్యాయో చెప్పాలని నకిరేకల్ ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు.
అధికారుల పనితీరుకు ఇవే నిదర్శనం.....
భీభత్సమైన వర్షాలు వచ్చి చెరువులు, కుంటలు తెగిపోతే ఇరిగేషన్ అధికారులు ఒకరిపై మరోకరు 'నా పరిధి కాదంటే... నా పరిధి కాదు'అని చెపుకోవడంతో వారి పనితీరు స్పష్టంగా కనిపిస్తుంది. అవి తెగి పంటలు, గ్రామాల ప్రజలకు నష్టం జరుగుతుందని తెలిసినా కనీస స్పందన లేకపోతే వాళ్లేమి విధులు నిర్వర్తిస్తున్నట్టు ప్రజలకు మేలు కోరే తీరు అదేనా....
ఎస్సీ పోస్టులో .. బీసీకి ఉద్యోగమా...?
ఎస్సీ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో ఉద్యోగాల భర్తీలో అధికారుల ఇష్టారాజ్యంగా ఉంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ చేయబడింది.. కానీ అక్కడ రంగారెడ్డి జిల్లాకు చెందిన బీసీ అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చారంటే వారి ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన ఎలా ఉందో అర్థమవుతుంది. దీనిపట్ల తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అధికారిపై ఫైర్ అయ్యారు. అంతేగాకుండా తనకు తెలియకుండా పాఠశాలను ఎలా తరలిస్తారని నిలదీశారు.
సభను నిశితంగా గమనించిన కలెక్టర్...
యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జేడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరు కావడం మొదటిసారి. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ఇదిలా ఉంటే సమావేశం జరుగుతున్న సమయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను నేరుగా పరిచయం చేసుకుని వారు చెప్పిన ప్రతి అంశాన్నీ నోట్ చేసుకున్నారు. సభ్యులు మాట్లాడే ప్రతి అంశాన్నీ, సభ జరుగుతున్న తీరును నిశితంగా గమనించారు. ఇప్పటికే తన మార్క్ జిల్లాలో చూపించాలని వేగంగా అడుగులు వేస్తున్న కలెక్టర్ సభ్యుల సమస్యలను పరిష్కరిస్తే మరింత వేగంగా నేరుగా ప్రజలకు మేలు జరగనుంది.
ప్రజాప్రతినిధులను గౌరవించకపోతే కఠిన చర్యలు
విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులను గౌరవించకపోతే కఠిన చర్యలు తప్పవు. హెచ్చరించారు. ఎవరికివ్వాల్సిన గౌరవాన్ని వారికిస్తూనే...వారి నుంచి అదే రీతిలో పొందాలి. ఏ మండల సమావేశాలకు అధికారులకు అనుమతి లేకుండా హాజరు కాకపోతే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. విద్యుత్ ప్రమాదాల వల్ల ఎవరైనా చనిపోతే వారికి సంబంధిత శాఖ నుంచి నష్టపరిహారం అందుతుంది. బాధితులకు అవగహన కల్పిస్తే మేలు జరుగుతుంది.