Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంగ నర్సింహులు
నవతెలంగాణ-రాజాపేట
క్విట్ ఇండియా పోరాట స్ఫూర్తితో కార్మికులు, కర్షకులు మరింత ఐక్యంగా పోరాడాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంగ నర్సింహులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో నిర్వహించిన ఆయా సంఘాల మండల జనరల్ బాడీ సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందన్నారు. తమ భూముల్లో కూలీలుగా రైతులను మార్వనుందన్నారు. మరోవైపు కార్పొరేట్ శక్తులు మరింత సులువు గా దోపిడీ చేసుకునేందుకు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్‌గా మార్చిందన్నారు. విద్యుత్ తో పాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడపీకుతుందన్నారు. రానున్న కాలంలో రిజర్వేషన్స్ కనుమరుగయ్యే పరిస్థితులు రానున్నాయన్నారు. క్విట్ ఇండియా స్ఫూర్తితో ఆగస్టు 9న మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించాలన్నారు. విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేవంలో సీఐటీయూ నాయకులు పబ్బోజు రాధమ్మ, రంగ రాజు ,బొందుగుల బాలయ్య, భాగ్య, శోభారాణి, పద్మ, విజయలక్ష్మి, భారతి, మంజుల, జయలక్ష్మి, రచ్చ పద్మ, మల్లేశం పాల్గొన్నారు.