Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాంపల్లి
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం,జిల్లా కమిటీ సభ్యులు చినపాక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.ఈ మేరకు ఆదివారం మండలంలోని పసునూరు గ్రామశాఖ నాల్గో మహాసభ రెడ్డిమల్ల గోవిందరాజు అధ్యక్షతన నిర్వహించారు.పార్టీ జెండాను బండ శ్రీశైలం ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ మాట్లాడుతూ నాటి నుండి నేటి వరకు ప్రజల తరపున నికరంగా పోరాడుతున్న నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులేనన్నారు. గ్రామాలలో డ్రయినేజీ, సిమెంట్‌రోడ్లు, ఇండ్ల స్థలాలు, పెన్షన్స్ తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని కోరారు.ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి వాసిపాక ముత్తిలింగం,చెట్టుపల్లి నాగ భూషణ్‌రెడ్డి, మల్ల గోవిందరాజు, పంబల లక్ష్మయ్య, ఆకారం లక్ష్మయ్య, ఆకారం శేఖర్, వాసిపాక వెంకటయ్య,వాసిపాక దిలీప్, కొమ్ము ముఖేష్, కొమ్ము వెంకటయ్య,గడ్డం ఎల్లేష్, కొమ్ము కృష్ణ పాల్గొన్నారు.