Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్రమత్తమైన పోలీసులు
నవతెలంగాణ-తాడ్వాయి
వర్గ పోరాటంలో భాగంగా వివిధ సంఘటనలో నాయకులు, ఉపాధ్యాయులు చారుమజుందార్, కన్హరు చటర్జీలు అమరులయ్యారు. కాగా మావోయిస్టు వారోత్సవాలను ఈ నెల 28 నుంచి ఆగస్టు 3వరకు వారం రోజుల పాటు మావోయిస్టు పార్టీ నిర్వహించ నుంది. ప్రతి సంవత్సరం జులై చివరి వారంలో జరుప ుకుంటున్న అమరవీరుల వారోత్సవాలను ఊరూరా, వాడవాడలా ఘనంగా నిర్వహించుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) వెంకటాపురం- వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్ ల పేర్లతో లేఖలు వచ్చిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా పోలీసులు, జిల్లాలోని అన్ని మండలాల పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోలు అలజడి సృష్టించే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చ రికలతో ఏజెన్సీ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహి స్తున్నారు. మావోలు అలజడి సృష్టించే అవకాశం ఉందన్న సమాచారంతో పస్రా సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై రవీందర్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు, మంగపేట, ఎటునాగారం, కన్నాయిగూడెం, వెంకటా పురం, వాజేడు మండలాల పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. బాంబు డిస్పోజల్ టీంతో ప్రధాన రహదారుల్లో రోడ్లకు ఇరువైపులా బ్రిడ్జిలు, మోరీల వద్ద ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. రెండు రోజులుగా తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్ బలగాలు సరిహద్దు మండలం, సరిహద్దు జిల్లా ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్ జిల్లాల సరిహద్దు, గుండాల మండలం పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశాయి. ఏజెన్సీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మావోయిస్టు యాక్షన్ టీంలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాన రహదారులపై వాహన రాకపోకలను పరిశీలి స్తున్నారు. పోలిస్ స్టేషన్ పరిధి గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినట్లు గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు. కాగా ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఏజెన్సీ ప్రాంతాల గ్రామాల ప్రజలు ఆదివాసీ గిరిజనులు బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు