Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
మున్సిపాలిటీపరిధిలో ఉన్న సుభాష్ చంద్రబోస్పార్కును, ప్రభుత్వ హాస్పిటలో నాటిన మొక్కలను, అంబేద్కర్ పార్కులోని పట్టణ ప్రకతివనాన్ని,అవెన్యూప్లాంటేషన్ను ఏవిన్యూ ప్లాంటేషన్ సోమవారం అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర మెయిన్ డ్రయినేజీ డ్యామేజ్ కావడాన్ని ఆయన పరిశీలించారు. 5వవార్డులోని శ్మశాన వాటిక,బీపీవీని సందర్శించి పలుసూచనలు జారీ చేశారు.లేపాక్షికాలనీలో చిట్టివాగు కబ్జాకు గురై ఫీడర్ఛానెల్ లెవల్ కావడంతో చేనేత గహాలు వరదతో మునుగుతున్నాయని నాలుగో వార్డ్ కౌన్సిలర్ అనపర్తి శేఖర్,చైర్ పర్సన్ సమక్షంలో అడిషనల్ కలెక్టర్కు వివరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న, మున్సిపల్ కమిషననర్ బి.వెంకట్రావు, వైస్ చైర్పర్సన్ దోటి సుజాతవెంకటేష్, కౌన్సిలర్లు అన్నెపర్తి శేఖర్, కోఆప్షన్ సభ్యులు రావిరాల నగేష్ పాల్గొన్నారు.