Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనుల్లో వేగం... నాణ్యత శూన్యం
- పర్యవేక్షణలో అధికారులు విఫలం
నవతెలంగాణ -రామన్నపేట
మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్న అభివద్ధి పనుల్లో నాణ్యతా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పనుల్లో నాణ్యత పాటించడంలో కాంట్రాక్టర్లు, అధికారులు గాలికి వదిలేస్తున్నారన్న ఆరోపణలు విస్తతంగా వినిపిస్తున్నాయి. అధికారులకు తెలిపినా ఫలితంలేదని విమర్శలు వస్తున్నాయి. మండల కేంద్రంలోని వంజరి వాడ మల్లికార్జున రైస్ మిల్లు వద్ద బీసీ కాలనీ నుండి వెంకట్రామయ్య చిన్న చెరువు అలుగు వరకు లక్షలాది రూపాయలతో నిర్మిస్తున్న నూతన మురుగు కాల్వ నిర్మాణ పనులు పూర్తిగా నాణ్యత లోపంతో కొనసాగుతున్నాయి. 40 ఎంఎం, 20 ఎంఎం కంకర వాడాల్సి ఉండగా నాసిరకం వేస్టేజ్ కంకర, నాసిరకం ఇసుక వాడుతున్నారు. సిమెంటు నిర్మాణాలు పూర్తయ్యాక (సిమెంటు కట్టడంపై నీరు పోయడం లేదు) క్యూరింగ్ ఎంత మాత్రం చేయడం చేయడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. పీఆర్ఏఈ ఈ నిర్మాణ పనులను పర్యవేక్షించిన దాఖలాలు లేవని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిల్లులు వచ్చేంతవరకు కట్టడాలు ఉంటే సరిపోతుంది ఆతర్వాత తమకేంటి అన్నట్లుగా కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు క్షేత్ర స్థాయిలో అభివద్ధి పనులను పరిశీలించి నాణ్యత లోపాలను సరిదిద్ది నిబంధనలు పాటించి నిర్మాణాలు జరిగేలా చూడాలని కోరుతున్నారు.
నాకు ఒకటే వర్క్ కాదు కదా...! : పీఆర్ఏఈ గాలయ్య
నాణ్యతా లోపాలు నా దష్టికి రాలేదు. నాకు ఎక్కడా కనిపించలేదు. ప్రతి పని నేను పర్యవేక్షిస్తూనే ఉన్నాను. నాకు ఒకటే వర్క్ కాదు కదా.. పనులను పరిశీలించి నాణ్యతా లోపాలు ఉంటే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటాం. బిల్లు ఇవ్వం. 10 ఎంఎం, 20ఎంఎం, 40ఎంఎం మూడురకాల కంకర వాడుతూ ఉంటారు. పనులు పూర్తయిన నాణ్యత పరీక్షలు నిర్వహిస్తాం. క్యూరింగ్ చేయాలని గట్టిగా వార్నింగ్ ఇస్తాం.